ఐపీఎల్–14 నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు నిష్క్రమించింది. విరాట్ కోహ్లి సారథ్యం కూడా నిరాశగానే ముగిసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లేయర్ సునీల్ నరైన్ (4 వికెట్లు, 15 బంతుల్లోనే 3 సిక్సర్లతో 26 పరుగులు) ఆల్‌రౌండ్ షోతో ఎలిమినేటర్‌లో బెంగళూరు పరాజయం పాలైంది. దాంతో ఐపీఎల్ టైటిల్ ఈ సీజన్‌లోనూ బెంగళూరుకు అందని ద్రాక్షే అయ్యింది. రేపు జరిగే రెండో క్వాలిఫయర్‌లో ఫైనల్ బెర్త్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొట్టేందుకు కోల్‌కతా నైట్‌రైడర్స్ సిద్ధమైంది.
షార్జా: సునీల్ నరైన్ మంత్రం ముందు కోహ్లి రణతంత్రం గెలవలేకపోయింది. మొదట తన స్పిన్ మాయాజాలంతో బెంగళూరును కట్టిపడేసిన ఈ స్పిన్నర్ తర్వాత భారీ సిక్సర్లతో మ్యాచ్‌పై ప్రత్యర్థి పట్టు తప్పించాడు. దీంతో సోమవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ నాలుగు వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించి క్వాలిఫయర్–2కు అర్హత సాధించింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిరీ్ణత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. ఓపెనర్లు కోహ్లి (33 బంతుల్లో 39; 5 ఫోర్లు), దేవ్‌దత్ పడిక్కల్ (18 బంతుల్లో 21; 2 ఫోర్లు) తర్వాత నరైన్ (4/21) మాయాజాలానికి ఇంకెవరూ 15 పరుగులను కూడా దాటలేకపోయారు. తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసి గెలిచింది. శుబ్‌మన్ గిల్ (18 బంతుల్లో 29; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు. నరైన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది.
బౌండరీలతో వేగం పెరిగినా...
బెంగళూరు ఓపెనర్లు పడిక్కల్, కోహ్లి మెరుపులు మెరిపించకపోయినా... బౌండరీ లతో స్కోరు బోర్డును పరిగెత్తించారు. అయితే ఫెర్గూసన్ ఆరో ఓవర్ తొలి బంతికి దేవ్‌దత్ (18 బంతుల్లో 21; 2 ఫోర్లు)ను బౌల్డ్ చేశాడు. దీంతో 49 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం చెదిరింది. గత ‘మ్యాచ్ విన్నర్’ శ్రీకర్ భరత్ (9)కు టాపా ర్డర్‌లో ప్రమోషన్ ఇచ్చారు. కానీ దీన్ని ఈ ఆంధ్ర ఆటగాడు సది్వనియోగం చేసుకోలేకపోయాడు. 10 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 70/2 స్కోరు చేయగలిగింది.
నరైన్ 4–0–21–4
కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కోల్‌కతా పట్టుబిగించింది. ఇది చాలదన్నట్లు నరైన్ ఓవర్‌కో కీలకమైన వికెట్‌ను పడగొట్టడంతో బెంగళూరుకు కష్టాలు తప్పలేదు. 13వ ఓవర్ వేసిన స్పిన్నర్ కెపె్టన్ కోహ్లిని బౌల్డ్ చేశాడు. తన తదుపరి ఓవర్లో (15వ) ‘మిస్టర్ 360’ డివిలియర్స్ (11)ను క్లీన్»ౌల్డ్ చేశాడు. 17వ ఓవర్ తొలి బంతికి షహబాజ్ వికెట్ కూడా చిక్కేది. కానీ బౌండరీ దగ్గర సునాయాసమైన క్యాచ్‌ను శుబ్‌మన్ గిల్ చేజార్చాడు. అయినా నిరాశచెందని నరైన్ ... మ్యాక్స్‌వెల్ (15)ను ఫెర్గూసన్ క్యాచ్‌తో పడేశాడు. తర్వాత కొట్టేవాళ్లు, చితగ్గొట్టేవాళ్లు కరువవడంతో... 14వ ఓవర్లో వంద పరుగులకు చేరుకున్న బెంగళూరు 20 ఓవర్లలో కనీసం 140 పరుగులైనా చేయలేకపోయింది. ఆఖరి 5 ఓవర్లలో పడుతూ లేస్తూ 30 పరుగులు మాత్రమే చేసింది.
ఆశలు రేపిన సిరాజ్
ఆరంభ ఓవర్లలో కోల్‌కతా ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్ (26) ధాటిగా ఆడారు. గార్టన్ నాలుగో ఓవర్లో గిల్ హ్యాట్రిక్ ఫోర్లతో అలరించాడు. కానీ అతని దూకుడుకు ఆరో ఓవర్లో హర్షల్ పటేల్ కళ్లెం వేశాడు. రాహుల్ త్రిపాఠి (6)ని చహల్ బోల్తాకొట్టించాడు. మరోవైపు అయ్యర్ నిలకడగా ఆడటంతో 10 ఓవర్లలో కోల్‌కతా 2 వికెట్లకు 74 పరుగులు చేసింది. అయ్యర్ ఔటయ్యాక మ్యాచ్‌లో పట్టు సాధించాలనుకున్న కోహ్లికి నరైన్ మళ్లీ కొరకరానికొయ్యగా మారాడు. క్రిస్టియాన్ వేసిన 12వ ఓవర్లో 3 సిక్స్‌లతో 22 పరుగులు రాబట్టుకోవడంతోనే బెంగళూరు ఆశలు ఆవిరయ్యాయి. ఆఖరి 18 బంతుల్లో 15 పరుగుల విజయ సమీకరణం కోల్‌కతాను సులువుగా ఊరిస్తుండగా... 18వ ఓవర్ వేసిన సిరాజ్ ఆశలు రేపాడు. 3 పరుగులే ఇచ్చి నరైన్, దినేశ్ కార్తీక్ (10)లను ఔట్ చేశాడు. 19వ ఓవర్లో గార్టన్ 5 పరుగులిచ్చాడు. ఆఖరి ఓవర్లో కోల్‌కతా 7 పరుగులు చేయాల్సిన దశలో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. కానీ క్రిస్టియాన్ తొలి బంతికే షకీబ్ బౌండరీ బాదడం... ఆ తర్వాత మూడు బంతులకు మూడు సింగిల్స్ రావడంతో కోల్‌కతా మరో 2 బంతులుండగానే విజయం సాధించింది.
స్కోరు వివరాలు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: దేవ్‌దత్ (బి) ఫెర్గూసన్ 21; కోహ్లి (బి) నరైన్ 39; భరత్ (సి) వెంకటేశ్ (బి) నరైన్ 9; మ్యాక్స్‌వెల్ (సి) ఫెర్గూసన్ (బి) నరైన్ 15; డివిలియర్స్ (బి) నరైన్ 11; షహబాజ్ (సి) శివమ్ మావి (బి) ఫెర్గూసన్ 13; క్రిస్టియాన్ (రనౌట్) 9; హర్షల్ పటేల్ (నాటౌట్) 8; గార్టన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 138.
వికెట్ల పతనం: 1–49, 2–69, 3–88, 4–102, 5–112, 6–126, 7–134.
బౌలింగ్: షకీబ్ 4–0–24–0, శివమ్ మావి 4–0–36–0, వరుణ్ 4–0–20–0, ఫెర్గూసన్ 4–0–30–2, నరైన్ 4–0–21–4.
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గిల్ (సి) డివిలియర్స్ (బి) హర్షల్ 29; వెంకటేశ్ అయ్యర్ (సి) భరత్ (బి) హర్షల్ 26; రాహుల్ త్రిపాఠి (ఎల్బీడబ్ల్యూ) (బి) చహల్ 6; రాణా (సి) డివిలియర్స్ (బి) చహల్ 23; నరైన్ (బి) సిరాజ్ 26; దినేశ్ కార్తీక్ (సి) భరత్ (బి) సిరాజ్ 10; మోర్గాన్ (నాటౌట్) 5; షకీబ్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (19.4 ఓవర్లలో 6 వికెట్లకు) 139.
వికెట్ల పతనం: 1–41, 2–53, 3–79, 4–110, 5–125, 6–126.
బౌలింగ్: సిరాజ్ 4–0–19–2, గార్టన్ 3–0–29–0, హర్షల్ 4–0–19–2, చహల్ 4–0–16–2, మ్యాక్స్‌వెల్ 3–0–25–0, క్రిస్టియాన్ 1.4–0–29–0.
RCB Vs KKR: బెంగళూరు బైబై... పాపం.. కోహ్లి.. ఇదే ఆఖరు!
Published Tue, Oct 12 2021 5:01 AM | Last Updated on Tue, Oct 12 2021 8:43 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment