Adil Rashid: ఆదిల్‌ రషీద్‌ కొత్త రికార్డు.. ఐపీఎల్‌ చరిత్రలో మూడో ఆటగాడు | Adil Rashid Was Third Player Played Most T20s At Time of IPL Debut | Sakshi
Sakshi News home page

Adil Rashid: ఆదిల్‌ రషీద్‌ కొత్త రికార్డు.. ఐపీఎల్‌ చరిత్రలో మూడో ఆటగాడు

Published Tue, Sep 21 2021 8:06 PM | Last Updated on Tue, Sep 21 2021 8:16 PM

Adil Rashid Was Third Player Played Most T20s At Time of IPL Debut - Sakshi

Courtesy: IPL Twitter

Adil Rasid IPL Debue.. ఐపీఎల్‌ 2021 సెకండ్‌ ఫేజ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌ ద్వారా పంజాబ్‌ కింగ్స్‌ తరపున ఆదిల్‌ రషీద్‌ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ఈ నేపథ్యంలో ఆదిల్‌ రషీద్‌ కొత్త రికార్డు సాధించాడు. ఐపీఎల్‌ అరంగేట్రం సమయానికి ఆదిల్‌ రషీద్‌ ఇంగ్లండ్‌తో పాటు మిగతా లీగ్‌లు కలిపి 201 టి20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ డెబ్యూ సమయానికి అత్యధిక టి20 మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా మూడో స్థానంలో ఉన్నాడు.  ఇంతకముందు డేవిడ్‌ మలాన్‌ పంజాబ్‌ కింగ్స్‌ తరపున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసే సమయానికి 227 టి20 మ్యాచ్‌లతో తొలి స్థానంలో ఉ‍న్నాడు. ఇక 202 టి 20 మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉన్న  జో డెన్లీ 2019 ఐపీఎల్‌ సీజన్‌లో కేకేఆర్‌ తరపున ఐపీఎల్‌ డెబ్యూ మ్యాచ్‌ ఆడాడు. 

చదవండి: KL Rahul: 22 పరుగుల దూరం.. ఐపీఎల్‌ చరిత్రలో రెండో బ్యాట్స్‌మన్‌గా

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే టాస్‌ గెలిచిన పంజాబ్‌ కింగ్స్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. బ్యాటింగ్‌ ఆరంభించిన రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన ఎవిన్‌ లూయిస్‌, యశస్వి జైశ్వాల్‌లు తొలి వికెట్‌కు 54 పరుగులు జోడించారు. ప్రస్తుతం రాజస్తాన్‌ వికెట్‌ నష్టానికి 57 పరుగులు చేసింది. జైశ్వాల్‌ 16, సంజూ శాంసన్‌ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement