Photo Courtesy: IPL
ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్..ఫైనల్స్‌కు చేరిన చెన్నై..
ఐపీఎల్ 2021 తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి చెన్నై ఫైనల్లో అడుగు పెట్టింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఆదిలోనే డుప్లిసిస్ వికెట్ కోల్పోయింది. ఆనంతరం బ్యాటింగ్ వచ్చిన రాబిన్ ఊతప్ప, రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కి 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి చెన్నై ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఊతప్ప 44 బంతుల్లో 7 ఫోర్లు, 63 పరుగులు చేసి టామ్ కుర్రాన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. అనంతరం 4పరుగుల వ్యవధిలో చెన్నై మూడు వికెట్లు కోల్పోయింది. టామ్ కరన్ వేసిన 14 ఓవర్లలో ఊతప్ప ,శార్దుల్ ఠాకూర్ పెవిలియన్‌కు చేరగా, రబాడా బౌలింగ్‌లో అంబటి రాయుడు రనౌట్ రూపంలో వెనుదిరిగాడు.
50 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆవేశ్ ఖాన్ వేసిన 19వ ఓవర్‌లో మొయిన్ ఆలీ ఓ ఫోర్, ధోనీ ఓ సిక్సర్ బాదడంతో 11 పరుగులు వచ్చాయి. టామ్ కరన్ వేసిన అఖరి ఓవర్‌లో 13 పరుగుల కావల్సిన సమయంలో తొలి బంతికి మొయిన్ ఆలీ ఔట్ అవ్వగా, వరుసగా 3 ఫోర్లు బాది ధోని చెన్నైను విజయతీరాలకు చేర్చాడు. ధోని కేవలం 6 బంతుల్లో 3ఫోర్లు 1 సిక్స్‌తో 18 పరుగులు సాధించాడు.
అంతక ముందు ఢిల్లీ క్యాపిటల్స్ నీర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఢిల్లీ ఆదిలోనే శిఖర్ ధావన్ వికెట్ కోల్పోయింది. అయినప్పటకీ పృథ్వీ షా ఫోర్లు, సిక్సర్‌లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. పృథ్వీ 34 బంతుల్లో 7 ఫోర్లు , 2 సిక్స్‌లతో 60 పరుగులు సాధించాడు. పృథ్వీ ఔటయ్యాక రిషబ్ పంత్(50), షిమ్రాన్ హెట్‌మైర్(37) కీలక ఇన్నింగ్స్ ఆడారు. చెన్నై బౌలర్లలో జోష్ హాజెల్‌వుడ్ రెండు వికెట్లు పడగొట్టగా, జడేజా, మొయిన్ అలీ, డ్వేన్ బ్రావో చెరో వికెట్ సాధించారు.
వరుస క్రమంలో వికెట్లు కోల్పోయిన చెన్నై..
4పరుగుల వ్యవధిలో చెన్నై మూడు వికెట్లు కోల్పోయింది. టామ్ కరన్ వేసిన 14 ఓవర్లలో ఊతప్ప ,శార్దుల్ ఠాకూర్ పెవిలియన్‌కు చేరగా, రబాడా బౌలింగ్‌లో అంబటి రాయుడు రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. 15 ముగిసే సరికి చెన్నై నాలుగు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రుతురాజ్ గైక్వాడ్(52),మొయిన్ అలీ(1) పరుగులతో ఉన్నారు. కాగా చెన్నై విజయానికి 30 బంతుల్లో 52 పరుగులు కావాలి.
రెండో వికెట్ కోల్పోయిన చెన్నై.. ఊతప్ప(63) ఔట్
113 పరుగుల వద్ద ఊతప్ప రూపంలో చెన్నై రెండో వికెట్ కోల్పోయింది. టామ్ కరన్ బౌలింగ్‌లో ఊతప్ప(63) శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
నిలకడగా ఆడుతున్న చెన్నై.. 10 ఓవర్లకు 94/1
173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై నిలకడగా ఆడుతుంది. ఆదిలోనే డుప్లెసిస్ వికెట్ కోల్పోయినప్పటకీ రాబిన్ ఉతప్ప(51), రుతురాజ్ గైక్వాడ్(43) ఇద్దరూ నిలకడగా ఆడుతూ చెన్నై స్కోర్ బోర్డును చక్కదిద్దారు. 11.3 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది.
చెన్నైకు బిగ్ షాక్.. డు ప్లెసిస్(1) ఔట్
173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ డుప్లెసిస్ కేవలం 1 పరుగుకే నోర్జ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యి పెవిలియన్‌కు చేరాడు. 2 ఓవర్లు ముగిసే సరికి సీఎస్‌కే వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రాబిన్ ఉతప్ప(10), రుతురాజ్ గైక్వాడ్(3) పరుగులతో ఉన్నారు.
Photo Courtesy: IPL
మెరిసిన పృథ్వీ షా.. చెన్నై టార్గెట్ 173
ఐపీఎల్ 2021 తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నీర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఢిల్లీ ఆదిలోనే శిఖర్ ధావన్ వికెట్ కోల్పోయింది. అయినప్పటకీ పృథ్వీ షా ఫోర్లు, సిక్సర్‌లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. పృథ్వీ 34 బంతుల్లో 7 ఫోర్లు , 2 సిక్స్‌లతో 60 పరుగులు సాధించాడు. పృథ్వీ ఔటయ్యాక రిషబ్ పంత్(50), షిమ్రాన్ హెట్‌మైర్(37) కీలక ఇన్నింగ్స్ ఆడారు. చెన్నై బౌలర్లలో జోష్ హాజెల్‌వుడ్ రెండు వికెట్లు పడగొట్టగా, జడేజా, మొయిన్ అలీ, డ్వేన్ బ్రావో చెరో వికెట్ సాధించారు.
నాలగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. పృథ్వీ షా (60) ఔట్
సీఎస్‌కే జరగుతున్న మ్యాచ్‌లో అర్ధసెంచరీ సాధించి మంచి ఊపు మీద ఉన్న పృథ్వీ షా వికెట్‌ను ఢిల్లీ కోల్పోయింది. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన పృథ్వీ షా, డు ప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. కాగా పృథ్వీ 34 బంతుల్లో 7 ఫోర్లు , 2 సిక్స్‌లతో 60 పరుగులు సాధించాడు. 12 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్(7), షిమ్రాన్ హెట్‌మైర్(7) పరుగలుతో ఉన్నారు
మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. అక్షర్ పటేల్ (10) ఔట్
77 పరుగుల వద్ద ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది.మొయిన్ అలీ బౌలింగ్‌లో అక్షర్ పటేల్ (10), సాంటినర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ..అయ్యర్(1) ఔట్
51 పరుగుల వద్ద ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. శ్రేయస్ అయ్యర్ కేవలం (1) పరుగు మాత్రమే చేసి జోష్ హాజెల్‌వుడ్ బౌలింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 7 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 60 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పృథ్వీ షా(42), అక్షర్ పటేల్(6) పరుగులతో క్రీజులో ఉన్నారు.
Photo Courtesy: IPL
తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. ధావన్(7) ఔట్
ఐపీఎల్ 2021 తొలి క్వాలిఫయర్‌లో భాగంగా సీఎస్‌కే జరగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ ధావన్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన ధావన్, హాజెల్‌వుడ్ బౌలింగ్‌లో ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 5 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. కాగా మరో ఓపెనర్ పృథ్వీ షా బౌండరీల వర్షం కురిపిస్తున్నాడు. కేవలం 17 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42 పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజులో పృథ్వీ షా(42),శ్రేయస్ అయ్యర్(1) పరుగులతో క్రీజులో ఉన్నారు.
Chennai Super Kings & Delhi Qualifier 1 Highlights: ఐపీఎల్ 2021లో భాగంగా తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ ఆసక్తికరమైన సమరానికి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యమివ్వబోతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
కాగా ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కి అర్హత సాధించనుంది. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో రెండు జట్లు ఇప్పటి వరకూ 25 మ్యాచ్‌ల్లో ముఖాముఖి తలపడ్డాయి. 15మ్యాచ్‌ల్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించగా.. మిగిలిన 10 మ్యాచ్‌ల్లో ఢిల్లీ గెలిచింది. కాగా ప్రస్తుత సీజన్ లీగ్ దశలో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోను చెన్నైని ఢిల్లీ చిత్తుగా ఓడించింది.
తుది జట్లు:
చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్, డు ప్లెసిస్, రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, ధోని (కెప్టెన్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్), టామ్ కరన్, అక్షర్ పటేల్, షిమ్రాన్ హెట్‌మైర్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడా, అవేశ్ ఖాన్, అన్రిచ్ నోర్జ్
చదవండి: 'ప్లీజ్ అన్న.. ఎస్‌ఆర్‌హెచ్‌లోనే ఉండవా'.. వార్నర్ ఫన్నీ రిప్లై
Comments
Please login to add a commentAdd a comment