Shubman Gill: Latest Instagram Post Goes Viral Fans Guessing Breakup - Sakshi
Sakshi News home page

Shubman Gill: ‘‘దేవతలతో ప్రేమలో పడకూడదు’’.. బ్రేకప్‌ అయ్యిందా బ్రో అంటూ..

Published Wed, Nov 3 2021 1:00 PM | Last Updated on Wed, Nov 3 2021 4:21 PM

Shubman Gill Latest Instagram Post Goes Viral Fans Guessing Breakup - Sakshi

Shubman Gill Instagram Post Leaves Fans Guessing About His Breakup Goes Viral: టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ ప్రస్తుతం విశ్రాంతి సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. తనకు ఇష్టమైన వ్యాపకాలతో బిజీబిజీగా గడుపుతున్నాడు. కాగా ఐపీఎల్‌-2021లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన శుభ్‌మన్‌... 17 మ్యాచ్‌లలో 17 ఇన్నింగ్స్‌ ఆడి 478 పరుగులు చేశాడు. కేకేఆర్‌ ఫైనల్‌ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు.

ఇక ఇంతవరకు టీ20 మ్యాచ్‌లలో భారత్‌ తరఫున అరంగేట్రం చేయని శుభ్‌మన్‌ గిల్‌కు... టీ20 ప్రపంచకప్‌- 2021 ఆడే భారత జట్టులో చోటు దక్కలేదన్న సంగతి తెలిసిందే. దీంతో... అతడికి బిజీ షెడ్యూల్‌ నుంచి కాస్త విరామం దొరికింది. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్‌డేట్స్‌ షేర్‌ చేస్తున్న శుభ్‌మన్‌ గిల్‌... తాజాగా పంచుకున్న ఓ ఫొటో చర్చకు దారితీసింది.

సిగ్మా రూల్‌ నెంబర్‌ 1 అంటూ అద్దంలో తనను తాను చూసుకుంటున్న ఫొటోను గిల్‌ షేర్‌ చేశాడు. ఇందులో గిల్‌ నల్లని టీ షర్టు ధరించినట్లుగా కనిపిస్తోంది. అంతేగాక షర్టు వెనుక భాగంలో... ‘‘దేవతలతో ప్రేమలో పడకూడదు’’ అన్న కొటేషన్‌ రాసి ఉంది. దీంతో గిల్‌కు తన ప్రేయసి గుడ్‌బై చెప్పిందేమో... బ్రేకప్‌ అయిపోయిందా అంటూ కొంతమంది నెటిజన్లు ఇష్టారీతిన కామెంట్లు చేస్తున్నారు. గిల్‌ షర్టుపై ఉన్న కోట్‌కు తమకు నచ్చిన భాష్యాలు చెబుతున్నారు. 

కాగా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ కుమార్తె సారా టెండుల్కర్‌తో శుభ్‌మన్‌ గిల్‌ ప్రేమలో పడ్డాడనే వదంతులు వ్యాపించిన సంగతి తెలిసిందే. సోషల్‌ మీడియాలో ఒకరి పోస్టులకు ఒకరు కామెంట్‌ చేస్తూ.. కాస్త స్నేహంగా ఉన్నట్లు కనిపించడంతో గాసిప్‌ రాయుళ్లు ఈ కథనాలు అల్లేశారు. అయితే... గిల్‌, సారాలు మాత్రం ఈ వార్తలపై స్పందించలేదు. ఇక ఇప్పుడు శుభ్‌మన్‌ ఈ ఫొటో షేర్‌ చేయడంతో మరోసారి అతడి రిలేషన్‌షిప్‌ స్టేటస్‌కు సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

చదవండి: T20 WC 2021: 'ప్రపంచకప్‌ మాదే' అన్న పాక్‌ అభిమాని.. స్టువర్ట్‌ బ్రాడ్‌ సూపర్‌ రిప్లై

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement