MS Dhoni: టీమిండియా కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోని గొప్పదనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అత్యుత్తమ సారథిగా.. బ్యాటర్‌గా.. వికెట్ కీపర్‌గా.. బెస్ట్ ఫినిషర్‌గా.. క్రికెట్ చరిత్రలో చెరగని ముద్ర వేశాడు. కేవలం ఆటతోనే కాకుండా.. సహచర క్రికెటర్లు, ఇతర జట్ల ఆటగాళ్లతో తను వ్యవహరించే తీరుతో కూడా కోట్లాది మంది అభిమానుల మనసు గెలుచుకున్నాడు ధోని భాయ్. తాజాగా మరోసారి ఈ విషయాన్ని నిరూపించుకున్నాడు. పాకిస్తాన్ పేసర్ హారిస్ రవూఫ్‌ను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాడు ధోని.
సంతకం చేసిన తన జెర్సీని అతడికి పంపించాడు. ఈ విషయాన్ని రవూఫ్ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘‘దిగ్గజం.. కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోని ఈ అందమైన బహుమతిని నాకు పంపించాడు. తన షర్టు ఇది. తన మంచి మనసుతో నెంబర్ ‘7’ ఇంకా హృదయాలను కొల్లగొడుతూనే ఉన్నాడు’’ అంటూ రవూఫ్ ధోనిపై అభిమానం చాటుకున్నాడు.
ఇందుకు స్పందించిన సీఎస్‌కే మేనేజర్ రసెల్ రాధాకృష్ణన్.. ‘‘మా కెప్టెన్ మాట ఇచ్చాడంటే.. తప్పక నెరవేరుస్తాడు’’ అని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా కొనసాగుతున్న ధోని 2021లో జట్టును చాంపియన్‌గా నిలిపిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు సీఎస్‌కే నాలుగుసార్లు టైటిల్ గెలిచింది. ఇక టీ20 ప్రపంచకప్-2021 సందర్భంగా టీమిండియా మెంటార్‌గా వ్యవహరించిన ధోని... భారత్‌తో పాకిస్తాన్ మ్యాచ్ ముగిసిన తర్వాత దాయాది జట్టు ఆటగాళ్లతో కాసేపు ముచ్చటించిన సంగతి తెలిసిందే.
When our captain @msdhoni promises he delivers , glad you love it champ #whistlepodu @ChennaiIPL https://t.co/3qybd0oFEE
— Russell (@russcsk) January 7, 2022
Comments
Please login to add a commentAdd a comment