IPL 2021: Sunil Narine Only 2nd Bowler Dismiss Kohli-De Villiers-Maxwell - Sakshi
Sakshi News home page

Sunil Narine: ఆ ముగ్గురిని ఔట్‌ చేయడం ఇది రెండోసారి మాత్రమే

Published Tue, Oct 12 2021 3:58 PM | Last Updated on Sun, Oct 17 2021 1:04 PM

IPL 2021: Sunil Narine Only 2nd Bowler Dismiss Kohli-De Villiers-Maxwell - Sakshi

Courtesy: IPL Twitter

Sunil Narine Was Only 2nd Bowler Dismiss RCB Trio.. ఆర్‌సీబీతో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో కేకేఆర్‌ స్టార్‌ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ మ్యాచ్‌ హీరోగా నిలిచిన సంగతి తెలిసిందే. మొదట బౌలింగ్‌లో 4 ఓవర్లు వేసి 21 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌లో మూడు సిక్సర్లతో 26 పరుగులు చేసి గేమ్‌ చేంజర్‌గా నిలిచాడు. అయితే ఇదే మ్యాచ్‌లో ఆర్‌సీబీ త్రయం కోహ్లి, డివిలియర్స్‌, మ్యాక్స్‌వెల్‌ను పెవిలియన్‌ చేర్చిన నరైన్‌  ఒక కొత్త రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్‌లో ఒకే మ్యాచ్‌లో ఈ త్రయాన్ని ఒక బౌలర్‌ వెనక్కి పంపడం ఇది రెండోసారి మాత్రమే. ఇంతకముందు పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్‌ హర్‌ప్రీత్‌ బార్‌ కోహ్లి, మ్యాక్స్‌వెల్‌, ఏబీలను వెనక్కి పంపిన తొలి బౌలర్‌గా నిలిచాడు. ఇక కేకేఆర్‌ అక్టోబర్‌ 13న ఢిల్లీ క్యాపిటల్స్‌తో క్వాలిఫయర్‌ 2 ఆడనుంది. ఇప్పటికే సీఎస్‌కే జట్టు ఫైనల్‌ చేరిన సంగతి తెలిసిందే.

చదవండి: IPL 2021: ఐపీఎల్‌ రేటింగ్స్‌.. బీసీసీఐకి బ్యాడ్‌న్యూస్‌

ఐపీఎల్‌లో నరైన్‌ అందుకున్న కొన్ని రికార్డులు పరిశీలిస్తే..
►ఐపీఎల్‌లో నరైన్‌ ప్లేఆఫ్స్‌లో రాణించిన రెండు సందర్భాల్లోనూ కేకేఆర్‌ ఐపీఎల్‌ టైటిల్‌ను గెలవడం విశేషం. ఇక మూడో టైటిల్‌ కోసం కేకేఆర్‌ వేట కొనసాగుతుంది.
►ఐపీఎల్‌ చరిత్రలో లీడింగ్‌ వికెట్‌ టేకర్‌ జాబితాలో నరైన్‌ ముందు వరుసలో ఉన్నాడు. 132 మ్యాచ్‌ల్లో 141 వికెట్లు పడగొట్టాడు.
► ఐపీఎల్‌ చరిత్రలో బెస్ట్‌ ఎకానమీ కలిగిన బౌలర్లలో నరైన్‌ అగ్రభాగంలో ఉన్నాడు. 

చదవండి: IPL 2021: లాస్ట్‌ బాల్‌ సిక్స్‌ కొడితే ఆ మజా వేరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement