
మిశ్రా స్థానంలో కుల్దీప్ యాదవ్
బంగ్లాదేశ్‌తో జరిగే ఏకైక టెస్టు నుంచి లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టి20 మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అతని మోకాలుకు గాయమైంది. మిశ్రా స్థానంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను భారత జట్టులోకి తీసుకున్నారు. భారత్ ‘ఎ’ తరఫున కుల్దీప్ బంగ్లాదేశ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడాడు. గతంలో వన్డే జట్టులోకి ఎంపికైనా అతనికి మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల కుల్దీప్ 22 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 81 వికెట్లు పడగొట్టాడు.