
చండీమల్ కట్టడికి టీమిండియా వ్యూహం
శ్రీలంకతో తొలిటెస్టులో చిత్తుగా ఓడిన టీమిండియా.. రెండో మ్యాచ్పై దృష్టిసారిస్తోంది.
కొలంబో: శ్రీలంకతో తొలిటెస్టులో చిత్తుగా ఓడిన టీమిండియా.. రెండో మ్యాచ్పై దృష్టిసారిస్తోంది. గాలె టెస్టులో అజేయ సెంచరీ చేసి మ్యాచ్ మలుపు తిప్పిన లంక బ్యాట్స్మన్ దినేశ్ చండీమల్ను కట్టడి చేయడానికి వ్యూహం రచిస్తోంది. రెండో టెస్టులో చండీమల్ను ఎదుర్కొనేందుకు భారత లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రాను బరిలో దింపాలని భావిస్తోంది. చండీమల్కు ఎలా బౌలింగ్ చేయాలన్న విషయంపై చర్చిస్తామని అమిత్ మిశ్రా చెప్పాడు. వీలైనంత తొందరగా అతన్ని అవుట్ చేయడానికి ప్రయత్నిస్తామని, అతనిపై బౌలింగ్ దాడి చేస్తామని అమిత్ అన్నాడు.
తొలి టెస్టులో లంకకు ఇన్నింగ్స్ ఓటమి ప్రమాదం ఎదురైనపుడు చండీమల్ (162 నాటౌట్) సూపర్ సెంచరీ చేసి ఆదుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత లంక బౌలర్ హెరాత్ (7/48) చెలరేగడంతో టీమిండియా ఓటమి చవిచూసింది. గురువారం నుంచి భారత్, శ్రీలంకల మధ్య రెండో టెస్టు జరుగుతుంది.