
మాది సమర్థవంతమైన జోడీ
తాను, అశ్విన్ రెండు ఎండ్‌లలో బౌలింగ్ చేస్తే ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచగలుగుతామని భారత లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా చెప్పాడు. ‘ఒకరు వికెట్లు తీస్తుంటే రెండో బౌలర్ పరుగులు రాకుండా ఒత్తిడి పెంచాలి. మా ఇద్దరి జోడీ ఈ పని సమర్థంగా చేస్తుంది’ అని మిశ్రా వ్యాఖ్యానించాడు. దక్షిణాఫ్రికా బలమైన జట్టే అయినా, భారత జట్టులో క్రికెటర్లంతా మంచి ఫామ్‌లో ఉన్నందున సిరీస్ హోరాహోరీగా సాగుతుందని అభిప్రాయపడ్డాడు.