
టాప్ టెన్ నుంచి కోహ్లి అవుట్
దుబాయ్: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో టాప్ టెన్ నుంచి పడిపోయాడు. తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో 11వ స్థానం దక్కించుకున్నాడు. శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల్లో విశేషంగా రాణించిన అశ్విన్ పైకి ఎగబాకాడు. బౌలింగ్ లో అశ్విన్ 8వ స్థానంలో నిలిచాడు. ఆల్ రౌండర్ విభాగంలో 2వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.
క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన కుమార సంగక్కర 7, మైఖేల్ క్లార్క్ 25 ర్యాంకుల్లో నిలిచారు. అజింక్య రహానే రెండు స్థానాలు ఎగబాకి 20వ స్థానం దక్కించుకున్నాడు. స్పిన్నర్ అమిత్ మిశ్రా అనూహ్యంగా 42 స్థానాలు ఎగబాకి 39వ ర్యాంకులో నిలిచాడు.