Covid-19: కోలుకున్న క్రికెటర్‌.. ఇంగ్లండ్‌​ టూర్‌కు లైన్‌ క్లియర్‌! | Wriddhiman Saha Amit Mishra Recovers From Covid 19 | Sakshi
Sakshi News home page

Covid-19: కోలుకున్న సాహా.. ఇంగ్లండ్‌​ టూర్‌కు లైన్‌ క్లియర్‌!

Published Wed, May 19 2021 7:35 AM | Last Updated on Wed, May 19 2021 10:25 AM

Wriddhiman Saha Amit Mishra Recovers From Covid 19 - Sakshi

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ టోర్నీలో కరోనా వైరస్‌ బారిన పడ్డ భారత జట్టు వికెట్‌ కీపర్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ప్లేయర్‌ వృద్ధిమాన్‌ సాహా కోలుకున్నాడు. దాంతో ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లేందుకు సాహాకు మార్గం సుగమం అయ్యింది. ఢిల్లీలో క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకున్న సాహాకు  నెగెటివ్‌ రావడంతో అతను కోల్‌కతాలోని తన ఇంటికి చేరుకున్నాడు.

ఇక అక్కడ కొన్ని రోజు లు గడిపిన తర్వాత ఇంగ్లండ్‌కు బయలుదేరే భారత జట్టు కోసం ముంబైలో ఏర్పాటు చేసిన బయో బబుల్‌లో అడుగు పెట్టనున్నాడు. అయితే ఇంగ్లండ్‌కు వెళ్లేలోపు సాహా తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాలి. జూన్‌ 2న భారత్‌ అక్కడికి బయలుదేరనుంది. మరోవైపు.. ఐపీఎల్‌-2021 సీజన్‌ ఆడే క్రమంలో కోవిడ్‌ బారిన పడిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు అమిత్‌ మిశ్రా కూడా కోలుకున్నాడు. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా వెల్లడించిన అతడు.. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు కృతజ్ఞతలు తెలిపాడు.

చదవండి: WTC Final: అందుకే వాషింగ్టన్‌తో కలిసి ఉండటం లేదు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement