న్యూఢిల్లీ: శ్రీలంక టూర్‌కు భారత జట్టు సభ్యులను బిసిసిఐ గురువారం ప్రకటించింది. శ్రీలంకతో అగస్టులో జరగబోయే టెస్ట్ సిరీస్కు భారత జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టులో హర్భజన్ సింగ్, ఇషాంత్ శర్మలకు చోటు లభించింది. కోహ్లీ నాయకత్వంలో టీం ఇండియా శ్రీలంక టూర్కు వెళ్లనుంది. ఈ సిరీస్కు రవిశాస్త్రి టీం ఇండియా డైరెక్టర్గా వ్యవహరించనున్నారు. నాలుగేళ్ల తర్వాత అమిత్ మిశ్రాకి టెస్ట్ జట్టులో చోటు లభించింది. ఆగస్టు 12 నుంచి లంక పర్యటనలో మనజట్టు మూడు టెస్ట్‌ల సిరీస్‌లో ఆడనుంది. సెలక్షన్ కమిటీ సందీప్ పాటిల్ ఆధ్యక్షతన సమావేశమై తుది జట్టును ప్రకటించారు. భారత జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), ధావన్, మురళి విజయ్, కేఎల్ రాహుల్, పుజారా, రహానే, రోహిత్ శర్మ, వృద్దిమాన్ సాహా(వికెట్ కీపర్), అశ్విన్, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, హర్భజన్ సింగ్, వరుణ్ అరోన్, అమిత్ మిశ్రా, ఉమేష్ యాదవ్
Published Thu, Jul 23 2015 3:58 PM | Last Updated on Wed, Mar 20 2024 3:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement