జింబాబ్వే పర్యటనను శబ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు ఘనంగా ముగించింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో తేడాతో భారత్ సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో ఓటమి తర్వాత టీమిండియా దెబ్బ తిన్న సింహంలా గర్జించింది.
వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఆతిథ్య జట్టును భారత్ చిత్తు చేసింది. తొలిసారి భారత జట్టు పగ్గాలను చేపట్టిన శుబ్‌మన్ గిల్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సిరీస్‌లో గిల్ కెప్టెన్సీ, వ్యక్తిగత ప్రదర్శన పరంగా ఆకట్టుకున్నాడు. అయితే శుబ్‌మన్ గిల్‌ను అందరూ ప్రశంసిస్తుంటే.. భారత వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా మాత్రం ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
గిల్ కెప్టెన్‌గా పనికిరాడని, అస్సలు నాయకత్వ లక్షణాలు లేవని మిశ్రా తెలిపాడు. మిశ్రా తాజాగా శుభాంకర్ మిశ్రా అనే యూట్యూబర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో టీమిండియాకు ఫ్యూచర్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ని ఎంపిక చేస్తారా అన్న ప్రశ్న మిశ్రాకు ఎదురైంది.
"భారత్ ఫ్యూచర్ కెప్టెన్‌గా గిల్‌ను అస్సలు నేను ఎంపిక చేయను. అతడికి అస్సలు కెప్టెన్సీ స్కిల్స్ లేవు. ఐపీఎల్‌లోనే అతడి నాయకత్వాన్ని చూశాను. అతనికి కెప్టెన్సీ ఎలా చేయాలో తెలియదని" మిశ్రా బదులిచ్చాడు.
కాగా ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన గిల్.. తన జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చడంలో విఫలమయ్యాడు. ఈ ఏడాది సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ కేవలం ఐదింట మాత్రమే విజయం సాధించి లీగ్ స్టేజ్‌లోనే నిష్క్రమించింది.
Comments
Please login to add a commentAdd a comment