photo credit: IPL Twitter
ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ముంబై ఇండియన్స్ బౌలర్ పియూష్ చావ్లా మూడో స్థానానికి ఎగబాకాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఇవాళ (మే 6, మధ్యాహ్నం 3:30 గంటలకు) జరుగుతున్న మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టిన చావ్లా.. సహచర వెటరన్, లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రాను వెనక్కు నెట్టి టాప్-3లోకి చేరాడు. ప్రస్తుతం పియూష్ ఖాతాలో 173 వికెట్లు ఉన్నాయి. ఈ జాబితాలో డ్వేన్ బ్రావో (183) టాప్‌లో ఉండగా.. రాజస్థాన్ స్పిన్నర్ చహల్ రెండులో.. పియూష్, అమిత్ మిశ్రా (172), మలింగ (170), అశ్విన్ (170) వరుసగా 3 నుంచి 6 స్థానాల్లో ఉన్నారు.
కాగా, ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆతిధ్య సీఎస్‌కే గెలుపు దిశగా సాగుతోంది. ఆ జట్టు మరో 17 పరుగులు చేస్తే (15 ఓవర్లలో 123/3) సీజన్‌లో ఆరో విజయాన్ని నమోదు చేస్తుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. సీఎస్‌కే బౌలర్లు పతిరణ (4-0-15-3), దీపక్ చాహర్ (3-0-18-2), తుషార్ దేశ్‌పాండే (4-0-26-2) విజృంభించడంతో 139 పరుగులకే పరిమితమైంది. ముంబై ఇన్నింగ్స్‌లో నేహల్ వధేరా (64) ఒక్కడే రాణించాడు.
అనంతరం 140 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్‌కేకు ఓపెనర్లు డెవాన్ కాన్వే (41నాటౌట్), శివమ్ దూబే (16 నాటౌట్) విజయం దిశగా నడిపిస్తున్నారు. రుతురాజ్ (30), రహానే (21), రాయుడు (12) ఔటయ్యారు. ముంబై బౌలర్లలో పియూష్ చావ్లా 2, ట్రిస్టన్ స్టబ్స్‌కు ఓ వికెట్ దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment