వన్డే ప్రపంచకప్-2023కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ఖారారు చేసింది. ఆఖరి నిమిషంలో గాయపడిన అక్షర్ పటేల్ స్ధానంలో అశ్విన్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇది మినహా ఎటువంటి మార్పులు చేయలేదు. అయితే అక్షర్ పటేల్ స్ధానంలో అశ్విన్‌ను ఎంపిక చేయడం పట్ల చాలా మంది మాజీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఇదే విషయంపై భారత మాజీ స్పిన్నర్, 2011 వరల్డ్‌కప్ విన్నర్ పీయూష్ చావ్లా తన అభిప్రాయాలను వెల్లడించాడు. అశ్విన్‌పై చావ్లా ప్రశంసల వర్షం కురిపించాడు. అశ్విన్‌కు బ్యాట్, బాల్‌తో రాణించగల సత్తా ఉందని చావ్లా కొనియాడాడు. అక్సర్‌కు అశ్విన్ సరైన ప్రత్యామ్నాయమని చావ్లా అభిప్రాయపడ్డాడు.
"అక్షర్ పటేల్ స్ధానంలో అశ్విన్‌ను ఎంపిక చేసి మేనెజ్‌మెంట్ సరైన నిర్ణయం తీసుకుంది. ఇందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు. అశ్విన్‌కు ఉన్న అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు. అశ్విన్ భారత పిచ్‌లపై మంచి ట్రాక్ రికార్డు ఉంది.
అదే విధంగా అతడు బ్యాట్‌తో కూడా రాణించగలడు. అతడొక స్మార్ట్ క్రికెటర్. గత రెండేళ్లుగా వన్డేల్లో పెద్దగా ఆడకపోయినప్పటికీ అశ్విన్‌కు అపారమైన అనుభవం ఉంది. చెన్నై వేదికగా టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయితే చెన్నై వికెట్(పిచ్) పరిస్ధితులు అశ్విన్‌కు బాగా తెలుసు. కాబట్టి అతడికి కచ్చితంగా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కుతోంది" అని ఈఎస్పీఈన్ క్రిక్ ఇన్‌ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చావ్లా పేర్కొన్నాడు.
చదవండి:World Cup 2023: అరుదైన రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లి.. కపిల్ దేవ్, ధోని సరసన
Comments
Please login to add a commentAdd a comment