‘ఒత్తిడిలో కుల్‌దీప్‌’ | Kuldeep Yadav Will Be Under Pressure | Sakshi
Sakshi News home page

కేకేఆర్‌ బౌలర్‌ పీయూష్‌ చావ్లా వ్యాఖ్యలు

Published Sat, Mar 24 2018 9:18 PM | Last Updated on Sat, Mar 24 2018 9:18 PM

Kuldeep Yadav Will Be Under  Pressure - Sakshi

కోల్‌కతా : వన్డేల్లో మంచి ఫామ్‌ కొనసాగిస్తున్న కుల్‌దీప్‌ యాదవ్‌పై ఐపీఎల్‌-11లో భారీ అంచనాలు ఉంటాయని టీమిండియా లెగ్‌ స్పిన్నర్‌ పీయూష్‌ చావ్లా అభిప్రాయపడ్డారు. కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న కుల్‌దీప్‌పై భారీ అంచానాలు ఉన్నందున కొంత ఒత్తిడికి గురికావాల్సిన ఉంటుందని, ఒత్తిడిలో కూడా రాణించగల సత్తా అతనికి ఉందని యాదవ్ పై ప్రశంశల జల్లు కురిపించారు. కుల్‌దీప్‌ కేకేఆర్‌కు ఆడటంతో మా బౌలింగ్‌ బలం మరింత దృఢంగా మారిందన్నారు. వన్డేల్లో మాదిరిగానే ఐపీఎల్‌లో కూడా వికెట్స్‌ తీయగల సత్తా కుల్‌దీప్‌కు ఉందని, తనతో కలిసి ఆడటం ఆశ్వాదిస్తానని తెలిపారు.

దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఆరు మ్యాచ్‌ల్లో 17 వికెట్స్‌తో బౌలర్ల జాబితాలో కుల్‌దీప్‌ మొదటి స్థానంలో నిలవగా, గత కొంత కాలంగా వన్డేలో టీమిండియా తరుఫున అద్భుతంగా రాణిస్తున్న నేపథ్యంలో పీయూష్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా నిడహాస్‌ ట్రోఫీ మ్యాచ్‌ హీరో దినేష్‌ కార్తీక్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న కేకేఆర్‌కు పీయూష్‌ చావ్లా, కుల్‌దీప్‌ యాదవ్‌, సునీల్‌ నరేన్‌తో కూడిన స్పిన్‌ విభాగం బలంగా ఉందన్నారు. కాగా కేకేఆర్‌ తన మొదటి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 8న కోల్‌కతలోని ఈడెన్‌ గార్డెన్‌లో బెంగుళూర్‌ రాయల్‌ చాలెంజర్స్‌తో పోటి పడనుంది. చావ్లా 2011 వన్డే ప్రపంచకప్‌ గెలిచిన టీంలో సభ్యుడు, దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తూ, ఐపీఎల్‌లో కేకేఆర్‌కే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement