భారత క్రికెట్ ఆటగాడు దినేశ్ కార్తీక్ (పాత చిత్రం)
న్యూఢిల్లీ : ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సత్తా ఉన్నా క్రికెటర్లలో ఒకరైన దినేశ్ కార్తీక్ తన మనసులో మాటను బయటపెట్టారు. కొద్దిరోజుల్లో ప్రారంభం కాబోతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సమరం గురించి ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ మాట్లాడారు. కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్)కు కెప్టెన్‌గా బరిలోకి దిగబోతున్న కార్తీక్.. తన గుండె మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ కోసం కొట్టుకుంటోందని వెల్లడించారు.
ఐపీఎల్ ప్రారంభమైన తొలి ఏడాదిలోనే తాను చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడతానని భావించానని అన్నారు. అయితే, 10 సీజన్లు గడిచినా అది సాధ్యం కాలేదని, ఏనాటికైనా కచ్చితంగా చెన్నై తరఫున ఆడతాననే నమ్మకం ఉందన్నారు. చెన్నైలోనే తాను పుట్టి, పెరిగానని అందుకే చెన్నై జట్టుకు ఒక్కసారైనా ఆడాలని అనుకుంటున్నాని తెలిపారు.
ఈ సీజన్ ఐపీఎల్‌లో తనపై నమ్మకం ఉంచి కెప్టెన్సీ బాధ్యతను అప్పగించిన కేకేఆర్‌ను నిరాశపర్చనని అన్నారు. ఐపీఎల్ ఆడే జట్లలో చెన్నై, బెంగుళూరు, కోల్‌కతా, ముంబై జట్లకు సింహభాగం ఫ్యాన్స్ ఉన్నారని చెప్పారు. ఏళ్లుగా ఆశాజనకమైన ఆటను ఆడుతున్న చెన్నై జట్టు క్రమంగా ఫ్యాన్ బేస్‌ను పెంచుకుందని అన్నారు.
దినేశ్ కార్తీక్ ఇప్పటివరకూ ఢిల్లీ డేర్ డెవిల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, గుజరాత్ లయన్స్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఐపీఎల్‌లో 152 మ్యాచ్‌లు ఆడిన దినేశ్ 24.81 యావరేజ్‌తో 2,903 పరుగులు సాధించారు. కాగా, నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన దినేశ్ చివరి బాల్‌కు సిక్స్ కొట్టి భారత్‌ను గెలిపించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment