ఐపీఎల్‌: సింగిల్‌ హ్యాండ్‌ చావ్లా | Piyush Chawla Get Rahul Tripathi Wicket | Sakshi
Sakshi News home page

Published Wed, May 23 2018 9:40 PM | Last Updated on Wed, May 23 2018 9:43 PM

Piyush Chawla Get Rahul Tripathi Wicket - Sakshi

పీయుష్‌ చావ్లా

కోల్‌కతా : ఐపీఎల్‌-11 సీజన్‌లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ స్పిన్నర్‌ పీయూష్‌ చావ్లా సింగిల్‌ హ్యాండ్‌ క్యాచ్‌తో అదరగొట్టాడు. క్రీజులో పాతుకుపోతున్న ఓపెనర్‌, కీలక బ్యాట్స్‌మన్‌ రాహుల్‌ త్రిపాఠి వికెట్‌ పడగొట్టాడు. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ ఓపెనర్లు అజింక్యా రహానే, రాహుల్ త్రిపాఠిలు ఇన్నింగ్స్‌ను దాటిగా ఆరంభించారు. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడిని చావ్లా అద్భుత బంతితో విడదీశాడు.

చావ్లా వేసిన 5 ఓవర్‌ తొలిబంతిని త్రిపాఠి డిఫెన్స్‌ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి అనూహ్యంగా గాల్లోకి లేచింది. అంతే వేగంతో చావ్లా ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. దీంతో రిటర్న్‌ క్యాచ్‌ త్రిపాఠి(20: 13 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) పెవిలియన్‌ చేరాడు.  ఇక బెంగళూరుతో జరిగిన కీలక మ్యాచ్‌లో త్రిపాఠి హాఫ్‌ సెంచరీతో రాణించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement