అబుదాబి : ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా కేకేఆర్ .. చెన్నై సూపర్ కింగ్స్‌కు 168 పరుగుల టార్గెట్ నిర్ధేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ సునీల్ నరైన్ స్థానంలో రాహుల్ త్రిపాఠిని ఓపెనర్‌గా పంపించింది. ఈ సందర్భంగా త్రిపాఠి ఓపెనర్‌గా మంచి షాట్స్ ఆడుతూ తన విలువేంటో చూపించాడు. సహచరులంతా తక్కువ స్కోరుకే వెనుదిరిగినా తాను మాత్రం ఇన్నింగ్స్ ఆసాంతం మెరుపులు మెరిపించాడు. త్రిపాఠి 51 బంతుల్లో 81 పరుగులు సాధించగా.. ఇందులో 8ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. మిగిలిన వారిలో ఎవరు చెప్పుకోదగ్గ ప్రదర్శన నమోదు చేయలేదు. కాగా నిర్ణీత ఓవర్లలో 20 ఓవర్లలో కేకేఆర్ 167 పరుగులకు ఆలౌట్ అయింది.(చదవండి : 'నచ్చినవారిని వదిలిరావడం ఎంతో కష్టం')
అంతకముందు రాహుల్ త్రిపాఠి శుబ్‌మన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు. కాగా స్కోరు 37 పరుగులకు చేరగానే కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ వేసిన నాలుగో ఓవర్ రెండో బంతికి శుబ్‌మన్ గిల్ క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన నితీష్ రాణా సహకారంతో త్రిపాఠి మాత్రం బౌండరీలతో విరుచుకుపడ్డాడు. దీంతో కేకేఆర్ స్కోరుబోర్డు ఉరకలెత్తింది. ఈ దశలో 8వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన కరణ్ శర్మ తను వేసిన మొదటిబంతికే వికెట్ తీసుకున్నాడు. భారీ షాట్‌కు యత్నించిన నితీష్ రాణా రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి అవుట్‌గా వెనుదిరిగాడు. (చదవండి : 'ఈ సమయంలో గేల్ చాలా అవసరం')
తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన సునీల్ నరైన్‌తో కలిసి ఇన్నింగ్స్ కొనసాగించిన త్రిపాఠి 31 బంతుల్లో 50 రన్స్ సాధించాడు. ఇందులో 5 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. కాగా కేకేఆర్ తొలి 10 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. నాలుగో స్థానంలో వచ్చిన సునీల్ నరైన్ 17 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కాగా నరైన్ అవుటైన తర్వాత బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుగా వచ్చిన ఇయాన్ మోర్గాన్ పూర్తిగా నిరాశపరిచాడు. తర్వాత వచ్చిన రసెల్, కమిన్స్, కార్తీక్ ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయారు. కాగా రాహుల్ త్రిపాఠి 81 పరుగుల వద్ద బ్రేవో బౌలింగ్‌లో వెనుదిరిగాడు. కాగా చెన్నై బౌలర్లలో బ్రేవో 3, శార్దూల్ ఠాకూర్, కరణ్ శర్మ,శామ్ కర్జన్ తలా రెండు వికెట్లు తీశారు.
Comments
Please login to add a commentAdd a comment