దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్‌లో చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఓపెనర్ నితీష్ రాణా 61 బంతుల్లో 87 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టాస్ గెలిచిన చెన్నై కేకేఆర్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వనించింది. ఓపెనర్లు శుభమన్ గిల్, నితీష్ రాణాలు ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ఆరంభించారు. పవర్ ప్లే ముగిసే సమయానికి కేకేఆర్ 6ఓవర్లలో 48 పరుగులు చేసింది. 26 పరుగులు చేసిన గిల్ జట్టు స్కోరు 53 పరుగుల వద్ద ఉన్నప్పుడు కర్ణ్ శర్మ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. (చదవండి : కేకేఆర్ సంకట స్థితి.. గెలిస్తేనే ప్లేఆఫ్ అవకాశం)
తర్వాత వచ్చిన సునీల్ నరైన్ వచ్చీ రాగానే భారీ సిక్స్ కొట్టినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. కాసేపటికే రింకూ సింగ్ కూడా వెనుదిరగడంతో కేకేఆర్ 99 పరుగులకే 3 వికెట్లు కోల్పయింది. ఈ దశలో మరో ఓపెనర్ నితీష్ రాణా 44 బంతుల్లో అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే కర్ణ్ శర్మ వేసిన 16వ ఓవర్లో నితీష్ రాణా హ్యాట్రిక్ సిక్సర్లతో మొత్తం 19 పరుగులు పిండుకోవడంతో కేకేఆర్ స్కోరు ఒక్కసారిగా మారిపోయింది. దీపక్ చాహర్ వేసిన 17వ ఓవర్లో రెండు ఫోర్లతో విరుచకుపడిన రాణా 87 పరుగుల వద్ద ఎన్గిడి బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఇక చివర్లో దినేష్ కార్తీక్ 10 బంతుల్లోనే 21 పరుగులు చేయడంతో కేకేఆర్ 172 పరుగుల గౌరవప్రదమైన స్కోరును సాధించింది. సీఎస్‌కే బౌలర్లలో ఎన్గిడి 2, సాంట్నర్, జడేజా, కర్ణ్ శర్మ తలా ఒక వికెట్ తీశారు.(చదవండి : ఇలాంటి కీపర్ ఉంటే అంతే సంగతులు)
Comments
Please login to add a commentAdd a comment