ఐపీఎల్ 16వ సీజన్‌లో సీఎస్‌కే వరుస విజయాలతో దూసుకెళుతుంది. తాజాగా ఆదివారం కేకేఆర్‌తో మ్యాచ్‌లో సీఎస్‌కే 49 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. 236 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.
జేసన్ రాయ్ 26 బంతుల్లో 61 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రింకూ సింగ్ 33 బంతుల్లో 53 నాటౌట్ మినహా మిగతావారు విఫలమయ్యారు. సీఎస్‌కే బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే, మహీష్ తీక్షణలు చెరో రెండు వికెట్లు తీయగా.. మొయిన్ అలీ, జడేజా, పతిరాణా, ఆకాశ్ సింగ్‌లు తలా ఒక వికెట్ తీశారు.
180 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ డౌన్
236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఓటమి దిశగా పయనిస్తోంది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తోంది. తాజాగా 4 పరుగులు చేసిన ఉమేశ్ యాదవ్ తీక్షణ బౌలింగ్‌లో కాన్వేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ ఎనిమిది వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.
టార్గెట్ 236.. 13 ఓవర్లలో కేకేఆర్ 119/4
13 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ నాలుగు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. రింకూ సింగ్ 20, జేసన్ రాయ్ 51 పరుగులతో ఆడుతున్నారు.
46 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన కేకేఆర్
235 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 46 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. నితీశ్‌రానా 22, జేసన్ రాయ్ క్రీజులో ఉన్నారు.
కేకేఆర్‌తో మ్యాచ్‌లో సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. అజింక్యా రహానే 29 బంతుల్లో 71 పరుగులతో విధ్వంసం సృష్టించగా.. శివమ్ దూబే 21 బంతుల్లో 50, డెవన్ కాన్వే 40 బంతుల్లో 56, గైక్వాడ్ 35 పరుగులు చేశారు. కెజ్రోలియా 2 వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తి, సుయాశ్ శర్మ చెరొక వికెట్ తీశారు.
19 ఓవర్లలో సీఎస్‌కే 218/3
19 ఓవర్లలో సీఎస్‌కే మూడు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అజింక్యా రహానే 71 పరుగులతో ఆడుతున్నాడు.
రహానే, దూబే ఫిఫ్టీ.. సీఎస్‌కే స్కోరు 194/3
సిక్సర్‌తో శివమ్ దూబే 20 బంతుల్లో ఫీఫ్టీ మార్క్ అందుకోగా.. అజింక్యా రహానే 24 బంతుల్లో ఫిఫ్టీ మార్క్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం సీఎస్‌కే మూడు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.
సిక్సర్ల వర్షం కురిపిస్తున్న దూబే.. భారీ స్కోరు దిశగా సీఎస్‌కే
కేకేఆర్‌తో మ్యాచ్‌లో సీఎస్‌కే బ్యాటర్ శివమ్ దూబే సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. 13 బంతుల్లోనే 38 పరుగులతో దాటిగా ఆడుతున్న దూబే ఖాతాలో నాలుగు సిక్సర్లు ఉన్నాయి. రహానే 37 పరుగులతో అతనికి సహకరిస్తున్నాడు. ప్రస్తుతం సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది.
13 ఓవర్లలో సీఎస్‌కే 123/2
13 ఓవర్లు ముగిసేసరికి సీఎస్‌కే రెండు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. రహానే 19, శివమ్ దూబే 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు కాన్వే 56 పరుగులు చేసి ఔటయ్యాడు.
గైక్వాడ్ (35) ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన సీఎస్‌కే
35 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్ సుయాశ్ శర్మ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం సీఎస్‌కే వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది.
7 ఓవర్లలో సీఎస్‌కే 72/0
ఏడు ఓవర్లు ముగిసేసరికి సీఎస్‌కే వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. గైక్వాడ్ 35, కాన్వే 37 పరుగులు చేశాడు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కేకేఆర్
ఐపీఎల్ 16వ సీజన్ 33వమ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఢీ కొంటున్నాయి. టాస్ గెలిచిన కేకేఆర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. వరుస విజయాలతో జోరు మీదున్న ధోనీ సేన మరో విజయంపై కన్నేసింది. మరోవైపు కోల్‌కతా హ్యాట్రిక్ ఓటమి తప్పించుకోవాలని భావిస్తోంది.
ఓపెనర్ డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, శివం దూబే సూపర్ ఫామ్‌లో ఉండడం చెన్నైకి కలిసొచ్చే అంశం. కోల్‌కతా విషయానికొస్తే.. వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రానా, రింకూ సింగ్‌పై ఎక్కువగా ఆధారపడుతోంది. ఆ జట్టుకు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, సుయాశ్ శర్మ రూపంలో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. దాంతో, ఇరుజట్ల మధ్య పోరు ఆసక్తికరంగా ఉండనుంది.
Comments
Please login to add a commentAdd a comment