అబుదాబి : సీఎస్‌కేతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకున్న కోల్‌కత ఇన్నింగ్స్‌ను నిలకడగా ఆడుతోంది. కాగా అందరూ ఊహించినట్టుగానే ఈ మ్యాచ్‌లో సునీల్ నరైన్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన రాహుల్ త్రిపాఠి.. శుబ్‌మన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు. కాగా స్కోరు 37 పరుగులకు చేరగానే కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ వేసిన నాలుగో ఓవర్ రెండో బంతికి శుబ్‌మన్ గిల్ క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన నితీష్ రాణా సహకారంతో త్రిపాఠి మాత్రం బౌండరీలతో విరుచుకుపడ్డాడు. దీంతో కేకేఆర్ స్కోరుబోర్డు ఉరకలెత్తింది. (చదవండి : పొలార్డ్‌ను అనుసరించిన దినేష్ కార్తీక్)
ఈ దశలో 8వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన కరణ్ శర్మ తను వేసిన మొదటిబంతికే వికెట్ తీసుకున్నాడు. భారీ షాట్‌కు యత్నించిన నితీష్ రాణా రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి అవుట్‌గా వెనుదిరిగాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన సునీల్ నరైన్‌తో కలిసి ఇన్నింగ్స్ కొనసాగించిన త్రిపాఠి 31 బంతుల్లో 50 రన్స్ సాధించాడు. ఇందులో 6 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. కాగా కేకేఆర్ తొలి 10 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. క్రీజులో త్రిపాఠి 52 పరుగులు, నరైన్ 13 పరుగులతో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment