టీ20 ప్రపంచకప్-2024 టూర్ భారత్‌లో కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న స్టార్ స్పోర్ట్స్ బృందం ఆదివారం ‘సాక్షి’ ఆఫీస్‌కు విచ్చేసింది.
హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో.. ప్రముఖ క్రికెటర్, టీ20 వరల్డ్‌కప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011 విజేత పీయూశ్ చావ్లా ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాక్షి జర్నలిస్టులతో ఆయన చిట్‌చాట్ చేశారు. ఈ క్రమంలో ఔత్సాహికులు అడిగిన ప్రశ్నలకు పీయూష్ చావ్లా ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.
టీ20 ప్రపంచకప్-2024 సెమీ ఫైనలిస్టులపై మీ అంచనా?
ఇండియా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్.. ఈ మూడింటితో పాటు ఇంగ్లండ్ లేదంటే న్యూజిలాండ్ జట్లను టాప్-4లో చూసే అవకాశం ఉంది.
స్పిన్నర్‌గా మీరు ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బ్యాటర్ ఎవరు?
వీరూ భాయ్(వీరేంద్ర సెహ్వాగ్), రాహుల్ భాయ్(రాహుల్ ద్రవిడ్).
కీలక సమయంలో ముఖ్యంగా డెత్ ఓవర్లలో మీరు ఒత్తిడిని ఎలా జయిస్తారు?
కెరీర్ ఆరంభంలో ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడికి గురికావడం సహజం. అయితే, అనుభవం గడిస్తున్న కొద్దీ మేనేజ్ చేసుకోగలుగుతాం.
టీ20 వరల్డ్‌కప్-2024లో పేసర్లు, స్పిన్నర్లలో ఎవరు కీలకం కానున్నారు?
వెస్టిండీస్ పిచ్‌లు స్లోగా ఉంటాయి. నాకున్న సమాచారం ప్రకారం అమెరికాలోనూ పరిస్థితి ఇలాగే ఉండబోతోంది. కాబట్టి స్పిన్నర్లు ఈసారి కీలక పాత్ర పోషిస్తారని అనుకుంటున్నా.
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా ఎదుర్కొనబోయే కఠినమైన ప్రత్యర్థి ఎవరనుకుంటున్నారు?
ఆస్ట్రేలియా. ఎందుకంటే ఐసీసీ టోర్నీలో ఒత్తిడిని ఎలా జయించాలో వాళ్లకు బాగా తెలుసు.
టీమిండియా స్పిన్నర్లలో ఈసారి ఎవరు కీలక పాత్ర పోషించనున్నారు?
కుల్దీప్ యాదవ్.
జస్‌ప్రీత్ బుమ్రా వరల్డ్‌కప్‌నకు సిద్ధంగా ఉన్నాడా?
అవును. మెగా టోర్నీ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. కచ్చితంగా ఈసారి అద్భుతంగా రాణిస్తాడనే నమ్మకం ఉంది. మెగా టోర్నీకి సిద్ధమయ్యే క్రమంలో తను ఐపీఎల్‌లో ఆఖరి మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు.
ఇలా పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ పీయూశ్ చావ్లా సరదాగా గడిపారు. కాగా ఐపీఎల్-2024లో పీయూశ్ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించారు. 11 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు పడగొట్టారు.
చదవండి: Virat Kohli: కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లి, అనుష్క.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment