Virat Kohli: కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లి, అనుష్క.. వీడియో వైరల్‌ | Virat Kohli Anushka Shed Tears As RCB Enter IPL 2024 Playoffs | Sakshi
Sakshi News home page

Virat Kohli: కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లి, అనుష్క.. వీడియో వైరల్‌

Published Sun, May 19 2024 10:40 AM | Last Updated on Sun, May 19 2024 11:28 AM

Virat Kohli Anushka Shed Tears As RCB Enter IPL 2024 Playoffs

విరుష్క భావోద్వేగం (PC: IPL/Jio Cinema)

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు అంచనాలు తలకిందులు చేస్తూ అద్బుతం చేసింది. ఐపీఎల్‌-2024 ప్లే ఆఫ్స్‌ సమీకరణలు ఇవేనంటూ సాగిన విశ్లేషణలను తలదన్నుతూ విలువైన విజయం సాధించింది.

అసలు టాప్‌-4లో నిలిచే జట్టే కాదంటూ విమర్శించిన వాళ్ల నోళ్లు మూయిస్తూ సగర్వంగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో గెలుపొంది జయభేరి మోగించింది.

సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో అభిమానులను ఉర్రూతలూగిస్తూ.. ఆద్యంతం ఆసక్తి రేపిన పోరులో పైచేయి సాధించిన ఆర్సీబీ టోర్నీలో ముందుకు సాగేందుకు అర్హత సాధించింది.

కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లి, అనుష్క.. 
ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఆటగాళ్లు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇక బెంగళూరు జట్టు ముఖచిత్రమైన విరాట్‌ కోహ్లి ఆనందం పట్టలేక కన్నీటి పర్యంతమయ్యాడు. స్టాండ్స్‌లో ఉన్న తన భార్య అనుష్క శర్మను చూస్తూ.. ‘‘సాధించాం’’ అన్నట్లుగా ఉద్వేగానికి లోనయ్యాడు.

కోహ్లిని చూస్తూ అనుష్క శర్మ సైతం.. ‘అవును’ అన్నట్లుగా ఆనంద భాష్పాలు రాలుస్తూ భర్తను చీర్‌ చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో విరుష్క జోడీని చూస్తూ తాము ఉద్వేగానికి లోనయ్యామంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఆరెంజ్‌ క్యాప్‌ ఇప్పటికీ కోహ్లిదే
కాగా ఈ సీజన్‌లో కోహ్లి అదరగొట్టినా అతడి ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా స్ట్రైక్‌రేటు గురించి సునిల్‌ గావస్కర్‌ వంటి దిగ్గజాలు ఘాటు వ్యాఖ్యలు చేస్తూ అతడిని విమర్శించారు. ఇందుకు కోహ్లి కూడా ధీటుగానే బదులిచ్చాడు.

అయినప్పటికీ జట్టు కనీసం ప్లే ఆఫ్స్‌ కూడా చేరకపోతే ఏమిటన్న బాధ మాత్రం అతడిలో స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలో శనివారం నాటి విజయంతో కోహ్లి ఇలా ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా ఈ సీజన్‌లో లీగ్‌ దశలో 14 మ్యాచ్‌లలో కలిపి కోహ్లి 708 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా ఉన్నాడు. 

చదవండి: RCB Vs CSK: నా ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అతడికి అంకితమిస్తున్నా: డుప్లిసిస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement