
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు భారత క్రికెట్ జట్టు అన్నివిధాల సన్నదమవుతోంది. ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టిన టీమిండియా.. లార్డ్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఇంగ్లండ్ పర్యటనకు ముందు రోహిత్ శర్మ టెస్టులకు వీడ్కోలు పలకడంతో భారత జట్టు కొత్త టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ బాధ్యతలు చేపట్టాడు.
అదేవిధంగా సాయిసుదర్శన్, అర్ష్‌దీప్ సింగ్‌లకు తొలిసారి భారత టెస్టు జట్టులో చోటు దక్కగా.. వెటరన్ కరుణ్ నాయర్ ఎనిమిదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సిరీస్‌తో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 సైకిల్ ఆరంభం కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి 24 వరకు జరగనుంది. మొదటి టెస్టుకు ముందు టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను పలు అరుదైన రికార్డు ఊరిస్తోంది.
అరుదైన రికార్డుకు చేరువలో బుమ్రా..
ఈ మ్యాచ్‌లో బుమ్రా రెండు వికెట్లు పడగొడితే సెనా(దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డులెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు పాకిస్తాన్ పేస్ బౌలింగ్ దిగ్గజం వసీం అక్రమ్ పేరిట ఉంది.
సెనా దేశాల్లో అక్రమ్ 32 టెస్టులు ఆడి 146 వికెట్లు పడగొట్టగా.. బుమ్రా ఇప్పటివరకు 31 టెస్టులు ఆడి 145 వికెట్లు సాధించాడు. కాగా ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో బుమ్రా కేవలం మూడు మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు. వర్క్‌లోడ్ మెనెజ్‌మెంట్ కారణంగా మిగిలిన రెండు మ్యాచ్‌లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ వెల్లడించాడు.
ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్, యశస్వి జైస్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్
ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ షెడ్యూల్..
జూన్ 20-24- తొలి టెస్ట్ (లీడ్స్)
జులై 2-6- రెండో టెస్ట్ (బర్మింగ్హమ్)
జులై 10-14- మూడో టెస్ట్ (లార్డ్స్)
జులై 23-27- నాలుగో టెస్ట్ (మాంచెస్టర్)
జులై 31-ఆగస్ట్ 4- ఐదో టెస్ట్ (కెన్నింగ్‌స్టన్ ఓవల్)