దీపికా ఆ స్విమ్మింగ్ పూల్ ఎక్కడుంది? | player Dipika Pallikal private pool pic went viral on social media | Sakshi
Sakshi News home page

దీపికా ఆ స్విమ్మింగ్ పూల్ ఎక్కడుంది?

Jul 1 2017 8:06 PM | Updated on Sep 5 2017 2:57 PM

దీపికా ఆ స్విమ్మింగ్ పూల్ ఎక్కడుంది?

దీపికా ఆ స్విమ్మింగ్ పూల్ ఎక్కడుంది?

వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు తీరిక సమయాలలో భార్య, పిల్లలతో గడుపుతున్నారు.

ఆంటిగ్వా: వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు తీరిక సమయాలలో భార్య, పిల్లలతో గడుపుతున్నారు. టీమిండియా క్రికెటర్లు ఎంఎస్ ధోని, ఓపెనర్ శిఖర్ ధావన్‌లు ఫ్యామిలీతో కరీబియన్ గడ్డపై సరదాగా షికార్లు చేస్తుండగా.. దినేశ్‌ కార్తీక్‌ కూడా తన భార్య, ఇండియా స్క్వాష్‌ క్రీడాకారిణి దీపికా పల్లికల్‌తో కలిసి విండీస్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. జట్టుతో పాటు కార్తిక్ కూడా విండీస్ పర్యటనలో ఉన్నాడు. అయితే దినేశ్ కార్తీక్ భార్య దీపిక.. స్విమ్మింగ్ పూల్‌లో దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫాలోయర్స్‌తో షేర్ చేసుకుంది.

'భర్త దినేశ్ కార్తీక్‌తో ప్రయాణించడం నాకు కష్టమైన పని' అంటూ దిపిక క్యాప్షన్ కూడా పెట్టింది. అయితే ఈ ఫొటో చూసిన మరో ఆటగాడు హార్దిక్ పాండ్యా స్విమ్మింగ్‌ పూల్‌కు ఫిదా అయ్యాడు. 'ఈ స్విమ్మింగ్ పూల్ ఎక్కడ ఉందో చెప్పవా అని' హార్దిక్ అడిగాడు. 'ఇక్కడి మా విల్లాలో నాకు ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ ఉంది. నువ్వు ఇక్కడికి వస్తే నిమ్మరసం నీకు సర్వ్ చేస్తానని' దీపిక బదులిచ్చింది. చెబితే ఎప్పుడో వచ్చేవాడినని పాండ్యా బదులిచ్చాడు. మరోవైపు ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యంలో ఉంది. విండీస్, భారత్ జట్ల మధ్య నాలుగో వన్డే ఆదివారం జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement