
కాంస్యంతో సరిపెట్టుకున్న దీపిక
ఆసియా గేమ్స్‌లో భారత్ కు స్క్వాష్‌లో పతకం దక్కింది. మహిళ సింగిల్స్ లో భారత స్టార్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ కాంస్య పతకం సాధించింది.
ఇంచియాన్: ఆసియా గేమ్స్‌లో భారత్ కు స్క్వాష్‌లో పతకం దక్కింది. మహిళ సింగిల్స్ లో భారత స్టార్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ కాంస్య పతకం సాధించింది. ప్రపంచ నంబర్‌వన్ నికోల్ డేవిడ్ (మలేసియా)తో జరిగిన సెమీఫైనల్లో 4-11 4-11 5-11తో దీపికా ఓటమి పాలయి కాంస్యంతో సరిపెట్టుకుంది.
25 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్ లో సింగిల్ పాయింట్ కూడా కోల్పోకుండానే దీపికను నికోల్ డేవిడ్ ఓడించింది. క్వార్టర్స్‌లో సహచరురాలు జోష్న చిన్నప్ప ఓడించి దీపిక సెమీస్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆసియా క్రీడల్లో భారత్ కు ఇదే తొలి స్క్వాష్ పతకం కావడం విశేషం.