మకావు ఓపెన్ విజేత దీపిక ఫైనల్లో ప్రపంచ | Squash: Dipika Pallikal beats former World No.1 to win Macau Open | Sakshi
Sakshi News home page

మకావు ఓపెన్ విజేత దీపిక ఫైనల్లో ప్రపంచ

Published Mon, Oct 21 2013 1:31 AM | Last Updated on Fri, Sep 1 2017 11:49 PM

మకావు ఓపెన్ విజేత దీపిక ఫైనల్లో ప్రపంచ

మకావు ఓపెన్ విజేత దీపిక ఫైనల్లో ప్రపంచ

మకావు: భారత టాప్ స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికాల్... మకావు ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. మహిళల ఫైనల్లో ప్రపంచ 17వ ర్యాంకర్ దీపిక 12-10, 5-11, 11-7, 11-9తో ప్రపంచ మాజీ నంబర్‌వన్ రాచెల్ గ్రిన్హామ్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించింది. దీంతో తన కెరీర్‌లో ఏడో డబ్ల్యూస్‌ఏ (మహిళల స్క్వాష్ అసోసియేషన్) టైటిల్‌ను కైవసం చేసుకుంది. 42 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత అమ్మాయి పూర్తి ఆధిపత్యం కనబర్చింది.
 
 కీలక సమయంలో మెరుగైన ఆటతీరుతో ఆకట్టుకుంది. ‘సెమీస్‌లో నటాలీపై గెలవడం నాలో ఆత్మ విశ్వాసాన్ని పెంచింది. సమ్మర్‌లో నేను తీసుకున్న శిక్షణ ఇప్పుడు ఫలితాన్నిస్తోంది. మైదానం వెలుపల చాలా కష్టపడ్డా. క్రమం తప్పకుండా టాప్-10 ప్లేయర్లపై విజయాలు సాధిస్తున్నా. మానసిక నైపుణ్యంతో మ్యాచ్‌లు ఆడుతున్నాను’ అని పల్లికాల్ విశ్లేషించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement