కౌలాలంపూర్: ప్రపంచ మహిళల స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ క్రీడాకారిణి దీపిక పళ్లికల్ పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది. మంగళవారం జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 19వ ర్యాంకర్ దీపిక 8-11, 9-11, 11-6, 11-6, 7-11తో ప్రపంచ పదో ర్యాంకర్ యాని అవు (హాంకాంగ్) చేతిలో ఓడిపోయింది.