
బంగారు ‘రాకెట్లు’
డబుల్స్‌లో స్వర్ణం
గ్లాస్గో: భారత స్క్వాష్ మహిళల జంట దీపికా పల్లికల్-జోష్న చినప్ప చరిత్ర సృష్టించారు. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో భారత్‌కు తొలిసారిగా పతకాన్ని.. అదీ స్వర్ణాన్ని అందించారు. శనివారం జరిగిన డబుల్స్ ఫైనల్లో దీపిక-జోష్న జోడి 11-6, 11-8తో ఇంగ్లండ్ జంట జెన్నీ డన్‌కాఫ్-లారా మసారోపై అద్భుత విజయం సాధించి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.
కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభమైనప్పటి నుంచి స్క్వాష్‌లో భారత్‌కు ఒక్క పతకమూ లేని లోటును తీర్చారు. ఈ మ్యాచ్‌కు దీపిక కాబోయే భర్త, భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్ హాజరై.. ఆమె విజయాన్ని ప్రత్యక్షంగా వీక్షించాడు.