సౌరవ్‌కు స్క్వాష్ టైటిల్ | Sourav to squash title | Sakshi
Sakshi News home page

సౌరవ్‌కు స్క్వాష్ టైటిల్

Published Sun, Sep 27 2015 11:54 PM | Last Updated on Sun, Sep 3 2017 10:05 AM

సౌరవ్‌కు స్క్వాష్ టైటిల్

సౌరవ్‌కు స్క్వాష్ టైటిల్

కోల్‌కతా: భారత స్క్వాష్ స్టార్ ప్లేయర్ సౌరవ్ ఘోషల్ సొంతగడ్డపై సత్తా చాటుకున్నాడు. ఆదివారం ముగిసిన ఇండియన్ స్క్వాష్ సర్క్యూట్ కోల్‌కతా ఇంటర్నేషనల్ ఓపెన్ టోర్నమెంట్‌లో చాంపియన్‌గా నిలిచాడు. టాప్ సీడ్ మర్వాన్ ఎల్‌షోర్‌బాగీ (ఈజిప్టు)తో జరిగిన ఫైనల్లో సౌరవ్ 11-7, 11-2, 11-7తో సంచలన విజయం సాధించాడు.

‘సొంతగడ్డపై సొంత ప్రేక్షకుల మధ్య విజేతగా నిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. టైటిల్ గెలిచే క్రమంలో ఇద్దరు టాప్-15లోని ఆటగాళ్లను ఓడించినందుకు గర్వంగా ఉంది’ అని సౌరవ్ వ్యాఖ్యానించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement