మూడో రౌండ్‌లో సౌరవ్‌ ఘోషాల్‌ | Sakshi
Sakshi News home page

మూడో రౌండ్‌లో సౌరవ్‌ ఘోషాల్‌

Published Wed, Dec 13 2017 1:02 AM

Sourav Ghoshal in the third round - Sakshi

ప్రపంచ స్క్వాష్‌ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ సౌరవ్‌ ఘోషాల్‌ మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌ ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీలో... మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో సౌరవ్‌ 11–4, 11–3, 11–4తో బెన్‌ కోల్మన్‌ (ఇంగ్లండ్‌)పై గెలుపొందాడు. మహిళల సింగిల్స్‌లో భారత స్టార్‌ ప్లేయర్లు జోష్నా చినప్ప, దీపిక పళ్లికల్‌ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. జోష్నా 9–11, 13–11, 5–11, 9–11తో సల్మా హనీ (ఈజిప్ట్‌) చేతిలో... దీపిక 7–11, 11–5, 9–11, 14–12, 8–11తో ఒలివియా బ్లాచ్‌ఫోర్డ్‌ (అమెరికా) చేతిలో ఓడిపోయారు.   

Advertisement
 
Advertisement
 
Advertisement