కుదిరితే ‘కనకం
కుదిరితే ‘కనకం
Published Tue, Sep 16 2014 1:55 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 PM
మరో మూడు రోజుల్లో ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నాయి. నాలుగేళ్ల క్రితం గ్వాంగ్‌జూలో జరిగిన క్రీడల్లో మనకు పతకాలు అందించిన క్రీడాంశాల్లో స్క్వాష్, జిమ్నాస్టిక్స్ కూడా ఉన్నాయి. అంతా అనుకున్నట్లు జరిగితే... ఈసారీ ఈ రెండు క్రీడాంశాల్లో మనకు పతకాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చివరి రెండు ఆసియా క్రీడల్లో కాంస్య పతకాలు నెగ్గిన భారత స్టార్ స్క్వాష్ ప్లేయర్ సౌరవ్ ఘోషల్... కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్యం నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన దీపా కర్మాకర్ ఇంచియోన్‌లోనూ సత్తా చాటుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.
న్యూఢిల్లీ: భారత స్టార్ స్క్వాష్ ప్లేయుర్ సౌరవ్ ఘోషల్ ఆసియూ క్రీడలపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. గత రెండు ఏషియూడ్‌లలో సింగిల్స్‌లో కాంస్య పతకాలు సాధించిన ఘోషల్ ఈసారి స్వర్ణం గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయుని అన్నాడు. అరుుతే భారత ఆశలపై పాకిస్థాన్ నీళ్లు చల్లే అవకాశాలు ఉన్నాయుని చెప్పాడు. ‘నిజంగా చెప్పాలంటే నేను స్వర్ణం నెగ్గే అవకాశాలు మెండుగా ఉన్నారుు. ఎందుకంటే నాలుగేళ్ల కిందటితో పోలిస్తే మెరుగైన ప్రదర్శనను ఇస్తున్నాను’ అని ఘోషల్ తెలిపాడు. ఇక ఆసియూ క్రీడల్లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగుతున్న ఘోషల్‌కు తొలి రౌండ్‌లో బై లభించింది. బంగారు పతకం సాధించాలంటే తను వురో నాలుగు వ్యూచ్‌ల్లో విజయుం సాధించాలి. ఈ ప్రపంచ నంబర్ 16... పాకిస్థాన్, వులేసియూ, హాంకాంగ్‌లకు చెందిన ఆటగాళ్లతో తలపడాల్సి ఉంటుంది. పాకిస్థాన్‌కు చెందిన 20 ఏళ్ల నాసిర్ ఇక్బాల్‌తో ఘోషల్ ఈ నెల 21న క్వార్టర్ ఫైనల్లో తలపడే అవకాశం ఉంది. తనకన్నా తక్కువ ర్యాంకు ఇక్బాల్‌కు ఉన్నప్పటికీ.. ఇద్దరి వుధ్య జరిగే ఈ పోరు తన సత్తాకు పరీక్ష లాంటిదని ఘోషల్ చెప్పాడు. ‘ఏషియూడ్‌లో నా కన్నా తక్కువ ర్యాంకున్న ఆటగాళ్లతో నేను పోటీపడబోతున్నాను. ఇవి ఆసియూ క్రీడలు కాబట్టి అందరూ పూర్తి స్థారుులో సన్నద్ధవువుతారు. కాబట్టి ప్రతీ ఒక్కరు ప్రవూదకరమైన వాళ్లే’ అని ఘోషల్ అన్నాడు.
Advertisement