squash tournament
-
రన్నరప్‌గా అనాహత్ సింగ్
ప్రతిష్టాత్మక బ్రిటిష్ జూనియర్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్లో భారత రైజింగ్ స్టార్ అనాహత్ సింగ్ రన్నరప్‌గా నిలిచింది. బర్మింగ్హమ్లో జరిగిన ఈ టోర్నీలో ఢిల్లీకి చెందిన 15 ఏళ్ల అనాహత్ సింగ్ అండర్–17 బాలికల సింగిల్స్ విభాగంలో రజత పతకం గెలిచింది. 68 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ అనాహత్ 11–7, 11–13, 10–12, 11–5, 9–11తో రెండో సీడ్ నాదీన్ ఎల్హమీ (ఈజిప్ట్) చేతిలో ఓటమి చవిచూసింది. ఈ టోర్నీ చరిత్రలో అనాహత్కిది మూడో పతకం. 2019లో అండర్–11 విభాగంలో, 2023లో అండర్–15 విభాగంలో అనాహత్ స్వర్ణ పతకాలు సాధించింది. -
బ్రిటిష్ ఓపెన్ విజేత అనాహత్ సింగ్
ప్రతిష్టాత్మక బ్రిటిష్ జూనియర్ ఓపెన్ స్క్వాష్ టోర్నీలో అండర్–15 బాలికల సింగిల్స్ విభాగంలో భారత అమ్మాయి అనాహత్ సింగ్ విజేతగా నిలిచింది. బర్మింగ్‌హామ్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో అనాహత్ 11–8, 8–11, 11–7, 11–5తో సొహైలా హజీమ్ (ఈజిప్ట్)పై గెలిచింది. 14 ఏళ్ల అనాహత్ బ్రిటిష్ ఓపెన్‌లో టైటిల్ నెగ్గడం ఇది రెండోసారి. 2019లో ఆమె అండర్–11 విభాగంలో టైటిల్ సాధించింది. గతంలో భారత్ నుంచి జోష్నా చినప్ప, దీపిక పళ్లికల్ మాత్రమే బ్రిటిష్ ఓపెన్ జూనియర్ టోర్నీలో విజేతలుగా నిలిచారు. -
సెమీస్‌లో జోష్నా చినప్ప, సౌరవ్ ఘోషాల్
ఆసియా స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ప్లేయర్లు జోష్నా చినప్ప, సౌరవ్ ఘోషాల్ మహిళల, పురుషుల వ్యక్తిగత విభాగాల్లో సెమీఫైనల్‌కు చేరుకున్నారు. కౌలాలంపూర్‌లో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో జోష్నా 12–10, 13–11, 11–7తో భారత్‌కే చెందిన తాన్వీ ఖన్నాను ఓడించగా... సౌరవ్ 11–4, 11–4, 11–3తో మొహమ్మద్ నఫీజ్వాన్ అద్నాన్ (మలేసియా)పై గెలుపొందాడు. -
జోష్నా సంచలనం
చెన్నై: భారత స్క్వాష్ క్రీడాకారిణి జోష్నా చినప్ప పెను సంచలనం సృష్టించింది. ఎనిమిది సార్లు ప్రపంచ చాంపియన్, మాజీ నంబర్‌వన్ నికోల్ డేవిడ్ (మలేసియా)పై కెరీర్లో తొలిసారి విజయం సాధించింది. ఈజిప్ట్‌లో జరుగుతున్న గునా అంతర్జాతీయ స్క్వాష్ టోర్నమెంట్లో భాగంగా ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో జోష్నా 11–8, 11–8, 11–8తో నికోల్‌ను బోల్తా కొట్టించింది. ‘నికోల్‌ను నేను ఎలా ఓడించానో అర్థం కావడం లేదు’ అని జోష్నా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మరోవైపు ఇదే టోర్నీలో భారత మరో క్రీడాకారిణి దీపిక పళ్లికల్ తొలి రౌండ్లోనే ఓటమి పాలైంది. -
రన్నరప్ నీల్ జోషి
బర్మింగ్హమ్: బ్రిటిష్ ఓపెన్ జూనియర్ స్క్వాష్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుడు నీల్ జోషి రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన బాలుర అండర్–15 సింగిల్స్ ఫైనల్లో నీల్ జోషి 8–11, 16–14, 0–11, 12–14తో టాప్ సీడ్ సామ్ టాడ్ (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోయాడు. అండర్–17 బాలుర సెమీఫైనల్లో తుషార్ సహాని 11–9, 2–11, 3–11, 8–11తో టాప్ సీడ్ ఒమర్ టోర్కీ (ఈజిప్ట్) చేతిలో పరాజయం చవిచూశాడు. -
సౌరవ్ ఓటమి
న్యూఢిల్లీ: చానెల్ వాస్ చాంపియన్‌షిప్ అంతర్జాతీయ స్క్వాష్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుడు సౌరవ్ ఘోషాల్ పోరాటం ముగిసింది. ఇంగ్లండ్‌లోని సర్రేలో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో సౌరవ్ 11–13, 8–11, 9–11తో టాప్ సీడ్ మొహమ్మద్ ఎల్‌షోర్‌బగీ (ఈజిప్ట్) చేతిలో ఓటమి చవిచూశాడు. అంతకుముందు సౌరవ్ తొలి రౌండ్లో 11–7, 11–7, 11–2తో మర్వాన్ ఎల్‌షోర్‌బగీ (ఈజిప్ట్)పై, క్వార్టర్ ఫైనల్లో 11–9, 5–11, 8–11, 11–3, 11–8తో ఎనిమిదో సీడ్ మొహమ్మద్ అబుల్గర్ (ఈజిప్ట్)పై గెలిచాడు. జోష్నా, దీపిక నిష్క్రమణ: మరోవైపు న్యూయార్క్‌లో జరుగుతున్న కారోల్ వేముల్లర్ ఓపెన్‌లో భారత స్టార్స్ జోష్నా చినప్ప, దీపిక పళ్లికల్ తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. జోష్నా 11–9, 11–13, 16–14, 5–11, 10–12తో సల్మా హనీ (ఈజిప్ట్) చేతిలో... దీపిక 8–11, 6–11, 7–11తో రానీమ్ ఎల్ వెలిలీ (ఈజిప్ట్) చేతిలో ఓడిపోయారు. ఆంధ్ర రంజీ జట్టుకు -
సెమీస్‌లో దీపిక
చెన్నై: శాన్ఫ్రాన్సిస్కో ఓపెన్ అంతర్జాతీయ స్క్వాష్ టోర్నమెంట్లో భారత స్టార్ ప్లేయర్ దీపిక పల్లికల్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. అమెరికాలో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 21వ ర్యాంకర్ దీపిక 13–11, 11–6, 11–9తో ఆరో సీడ్, ప్రపంచ 17వ ర్యాంకర్ ఒలివియా బ్లాచ్‌ఫోర్డ్ (అమెరికా)పై సంచలన విజయం సాధించింది. 2014 తర్వాత ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) వరల్డ్ టూర్ టోర్నమెంట్లో దీపిక సెమీస్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. తొలి రౌండ్లో ప్రపంచ 13వ ర్యాంకర్ ఎమిలీ విట్లాక్ (ఇంగ్లండ్)ను ఓడించిన దీపిక సెమీఫైనల్లో ఐదో ర్యాంకర్ నికోల్ డేవిడ్ (మలేసియా)తో ఆడుతుంది. -
హరీందర్ ‘హ్యాట్రిక్'... దీపిక ‘డబుల్'
చెన్నై: స్వదేశంలో తమ ఆధిపత్యాన్ని చాటుకుంటూ... జేఎస్‌డబ్ల్యూ ఇండియన్ సర్క్యూట్ అంతర్జాతీయ స్క్వాష్ టోర్నమెంట్లో భారత ప్లేయర్స్ హరీందర్ పాల్ సంధూ, దీపిక పళ్లికల్ విజేతలుగా నిలిచారు. బుధవారం ముగిసిన ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్‌లో హరీందర్... మహిళల సింగిల్స్‌లో దీపిక చాంపియన్స్‌గా అవతరించారు. ఇండియన్ సర్క్యూ ట్లో హరీందర్కిది ‘హ్యాట్రిక్’ టైటిల్ కాగా... దీపికకు వరుసగా రెండో టైటిల్ కావడం విశేషం. ఫైనల్స్‌లో దీపిక 11-6, 11-2, 11-8తో మిసాకి కొబయాషి (జపాన్)పై గెలుపొందగా... హరీందర్ 11-8, 11-3, 11-6తో టాప్ సీడ్ కరీమ్ అలీ ఫతీ (ఈజిప్టు)ను బోల్తా కొట్టించాడు. ఇంతకుముందు హరీందర్ జైపూర్, ముంబైలలో జరిగిన టోర్నీల్లోనూ టైటిల్ సాధించాడు.