
చెన్నై: శాన్‌ఫ్రాన్సిస్కో ఓపెన్ అంతర్జాతీయ స్క్వాష్ టోర్నమెంట్‌లో భారత స్టార్ ప్లేయర్ దీపిక పల్లికల్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. అమెరికాలో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 21వ ర్యాంకర్ దీపిక 13–11, 11–6, 11–9తో ఆరో సీడ్, ప్రపంచ 17వ ర్యాంకర్ ఒలివియా బ్లాచ్‌ఫోర్డ్ (అమెరికా)పై సంచలన విజయం సాధించింది.
2014 తర్వాత ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్‌ఏ) వరల్డ్ టూర్ టోర్నమెంట్‌లో దీపిక సెమీస్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. తొలి రౌండ్‌లో ప్రపంచ 13వ ర్యాంకర్ ఎమిలీ విట్‌లాక్ (ఇంగ్లండ్)ను ఓడించిన దీపిక సెమీఫైనల్లో ఐదో ర్యాంకర్ నికోల్ డేవిడ్ (మలేసియా)తో ఆడుతుంది.