జోత్స్న చినప్ప, ఘోషల్‌లకు టైటిల్స్ | Saurav Ghosal, Joshna Chinappa clinch titles with ease | Sakshi
Sakshi News home page

జోత్స్న చినప్ప, ఘోషల్‌లకు టైటిల్స్

Published Sun, Dec 22 2013 3:06 AM | Last Updated on Mon, Oct 8 2018 6:22 PM

Saurav Ghosal, Joshna Chinappa clinch titles with ease

ముంబై: మహారాష్ట్ర స్టేట్ ఓపెన్ సీనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో జోత్స్న చినప్ప, సౌరవ్ ఘోషల్ టైటిల్స్ సాధించారు. పురుషుల విభాగం ఫైనల్లో ప్రపంచ 15వ ర్యాంకర్ సౌరవ్ వరుస సెట్లలో ప్రత్యర్థిని కంగుతినిపించాడు.
 
 శనివారం జరిగిన ఫైనల్లో కోల్‌కతాకు చెందిన ఘోషల్ 11-4, 11-6, 11-5తో ప్రపంచ 80వ ర్యాంకర్ హరిందర్‌పాల్ సింగ్ సంధుపై విజయం సాధించాడు. కేవలం 40 నిమిషాల్లోనే ఆట ముగించాడు. మహిళల ఈవెంట్‌లో ప్రపంచ 26వ ర్యాంకర్, టాప్ సీడ్ జోత్స్న 11-1, 11-1, 11-3తో ఐశ్వర్య భట్టాచార్యపై గెలుపొందింది. జోత్స్న జోరుకు ప్రత్యర్థి బెంబేలెత్తింది. కేవలం 20 నిమిషాల్లోనే ప్రత్యర్థిపై జయభేరి మోగించింది. ట్రోఫీలతో పాటు ఘోషల్‌కు రూ. 1.3 లక్షలు, జోత్స్నకు రూ. 70 వేలు నగదు బహుమతి అందజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement