
ఆసియా సీనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు సౌరవ్ ఘోషాల్, జోష్నా చినప్ప ఫైనల్లోకి దూసుకెళ్లారు. కౌలాలంపూర్‌లో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో 2017 రన్నరప్ సౌరవ్ 11–2, 11–6, 11–4తో ఎన్జీ ఎయిన్ యో (మలేసియా)పై గెలుపొందాడు.
మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ జోష్నా 11–7, 12–10, 11–3తో శివసంగరి సుబ్రమణియం (మలేసియా)పై విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్స్‌లో ఆనీ అయు (హాంకాంగ్)తో జోష్నా; లియో చున్ మింగ్ (హాంకాంగ్)తో సౌరవ్ తలపడతారు.