కమల్‌ హాసన్‌ 'గుణ' రీ-రిలీజ్‌పై కోర్టు నోటీసులు | Kamal Haasan Guna Movie Re Release Issue | Sakshi
Sakshi News home page

కమల్‌ హాసన్‌ 'గుణ' రీ-రిలీజ్‌పై కోర్టు నోటీసులు

Published Thu, Jul 11 2024 3:07 PM | Last Updated on Thu, Jul 11 2024 3:41 PM

Kamal Haasan Guna Movie Re Release Issue

కమల్ హాసన్ నటించిన గుణ సినిమా 1991లో విడుదలైంది. స్వాతి చిత్ర ఇంటర్నేషనల్ బ్యానర్‌పై పల్లవి- చరణ్‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.  సంతాన భారతి దర్శకత్వం వహించాడు. ఇందులో కమల్ హాసన్, రేఖ నటించారు. ఇది తమిళ, తెలుగులో కూడా విడుదలైంది. అయితే, జూన్‌ 21న  ఈ చిత్రాన్ని పిరమిడ్, ఎవర్‌గ్రీన్ మీడియా కలిసి తమిళనాట రీ-రిలీజ్‌ చేశాయ్‌. దీంతో వారికి కోర్టు నోటీసులు జారీ చేసింది.

మలయాళ చిత్రసీమలో ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమా 'మంజుమ్మాళ్ బాయ్స్'. ఈ సినిమా కథకు మూలం గుణ గుహలు అనే విషయం తెలిసిందే. సినిమా మొత్తం ఆ గుహల చుట్టూ తిరుగుతుంది. అదే ప్రాంతంలో కమల్‌ హాసన్‌ గుణ సినిమా కూడా ఎక్కువ భాగం అక్కడే షూటింగ్‌ జరిగింది.  'మంజుమ్మాళ్ బాయ్స్' సినిమా వల్ల గుణ గుహలకు వచ్చిన క్రేజ్‌ను క్యాష్‌ చేసుకోవాలని కమల్‌ సినిమాను రీ-రిలీజ్‌ చేశారు. అయితే,  గన్‌శ్యామ్ హేమ్‌దేవ్ దీనిని తప్పుపట్టారు.  మద్రాస్ హైకోర్టులో పిరమిడ్, ఎవర్‌గ్రీన్ మీడియాను తిరిగి గుణ చిత్రాన్ని విడుదల చేయకుండా శాశ్వతంగా నిషేధించాలని కోరుతూ ఆయన పిటీషన్ దాఖలు చేశారు. ఈ సినిమా కాపీరైట్‌ను తాను కొనుగోలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

కమల్‌ గుణ సినిమాకు పూర్తి యజమానిగా తనను ప్రకటించాలని కోర్టును ఆయన కోరారు. అంతేకాకుండా సినిమా రీ-రిలీజ్‌ ద్వారా వచ్చిన ఆదాయాన్ని వెల్లడించి, అంతే మొత్తాన్ని తనకు ఇవ్వాలని పిరమిడ్‌ అండ్‌ ఎవర్‌గ్రీన్‌ మీడియా కంపెనీని ఆదేశించాలని గన్‌శ్యామ్‌ హేమ్‌దేవ్‌ డిమాండ్‌ చేశారు. గుణ సినిమా రీ-రిలీజ్‌పై  మధ్యంతర నిషేధం విధిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.  గన్‌శ్యామ్ హేమ్‌దేవ్ పిటీషన్‌పై  పిరమిడ్, ఎవర్‌గ్రీన్ మీడియా కూడా జూలై 22లోగా స్పందించాలని కోర్టు తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement