ఎంపీలో కాంగ్రెస్ ఓటమికి నాదే బాధ్యత
గుణ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి తనదే బాధ్యత అని కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సింధియా రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే.
గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, పార్టీ ఓటమికి దారితీసిన కారణాలపై లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ నాయకులపై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ చేస్తున్న విమర్శలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.