యువ నటుడు ఎస్ఆర్ గుణ దర్శకుడిగా మారబోతున్నాడు. 'కయిరు', 'వాండు' తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇతడు... 'కయిరు' చిత్రానికిగానూ 2019లో కొలకత్తా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో, మెర్సికోలో జరిగిన సెవెన్ కలర్స్ బ్యాచిలర్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డులను అందుకున్నాడు. కాగా తాజాగా సేయన్ స్టూడియో సంస్థ నిర్మిస్తున్న తీర్పు అనే చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
(ఇదీ చదవండి: హైపర్ ఆదితో పెళ్లి? క్లారిటీ ఇచ్చేసిన వర్షిణి!)
డైరెక్టర్ కావడంపై స్పందించిన గుణ.. 'జాతి వివక్షతపై పోరాడిన వివిధ దేశాల చెందిన పోరాటయోధులను ఆయా దేశాలు తీవ్రవాదులుగా ముద్రవేసి దేశం నుంచి బహిష్కరించాయి. దీంతో ఇతర దేశాలను ఆశ్రయించిన ఆ పోరాట దారులు అక్కడ నుంచే న్యాయం కోసం రాజకీయ పోరాటం చేస్తారు. అక్కడ న్యాయం దొరకదు. దీంతో ఒక వ్యక్తి అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించి జాతి వివక్షతపై ఎలా పోరాటం చేశారు అనే స్టోరీతో తీస్తున్న సినిమా 'తీర్పు' అని ఎస్ఆర్ గుణ తెలిపారు. కెనడాకు చెందిన యాక్టర్స్, టెక్నీషియన్స్‌ని ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే తీర్పు షూటింగ్ ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
(ఇదీ చదవండి: ఒక్క వీకెండ్.. నాలుగు సినిమాలు.. రికార్డ్ కలెక్షన్స్!)
Comments
Please login to add a commentAdd a comment