
బస్సులో ఇరుక్కుపోయిన డ్రైవర్ మల్లయ్య, గాయపడిన ప్రయాణికులు
మానకొండూర్: లారీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేటకు చెందిన ఆర్టీసీ బస్సు మంగళవారం వేములవాడ నుంచి సూర్యాపేట వెళ్తోంది. మార్గమధ్యలో మానకొండూర్ పోలీస్‌స్టేషన్ సమీపంలో ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న జి.కమలమ్మ, భిక్షం, రమణ, బండపెల్లి పద్మతో సహా 15 మంది గాయపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహా యక చర్యలు చేపట్టారు. డ్రైవర్ మల్లయ్య బస్సు క్యాబిన్‌లో ఇరుక్కుపోవడంతో అతికష్టమ్మీద బయటకు తీశారు. అనంతరం క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment