నీడ కరువు
గరుగుబిల్లి: మండలంలోని సంతోషపురం పంచాయతీ పరిధి ఖడ్గవలస జంక్షన్‌లో పదేళ్ల కిందట నిర్మించిన బస్ షెల్టర్ శిథిలావస్థకు చేరింది.
దీంతో ప్రయాణికులు ఆ జంక్షన్‌లో ఎండలోనే నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ షెల్టర్ ముందు స్థానిక వ్యాపారులు షాపులు నిర్వహిస్తున్నారు. దీంతో బస్‌షెల్టర్ ఎవరికీ కనిపించడం లేదు. ప్రయాణికులు వాహనాల కోసం వేచి ఉండేందుకు నీడ కరువు కావడంతో పాటు ఎక్కడా స్థలం లేకపోవడంతో దుకాణాల వద్ద నిల్చుంటున్నారు.
షెల్టర్‌ను పునర్నిర్మించాలని పలుమార్లు అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా షెల్టర్‌ను నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.