సాక్షి, ముంబై: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను, వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు, ఇందులో భాగంగానే ఇటీవల తన ట్విటర్ ద్వారా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటోంది.
డ్రోన్ వీడియోను షేర్ చేస్తూ 'బెంగుళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే కింద వందే భారత్ ట్రైన్ వెళుతోంది, గ్లోబల్-స్టాండర్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ భారతదేశాన్ని ఎలా మారుస్తుందో అని చెప్పడానికి ఇది నిలువెత్తు నిదర్శనం అని చెప్పుకొచ్చారు'. ఈ వీడియోకి వేల సంఖ్యలో లైకులు రాగా, చాలా మంది కామెంట్స్ కూడా చేశారు.
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియోలో ఒక ఎక్స్‌ప్రెస్‌వే కింద 'వందే భారత్' ట్రైన్ వెళ్లడం చూడవచ్చు. ఈ అద్భుతమైన సన్నివేశం 'బెంగళూరు-మైసూరు' ఎక్స్‌ప్రెస్‌వే వద్ద చూడవచ్చు. నిజానికి బెంగళూరు - మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే రెండు దశల్లో ఉంటుంది. ఫేజ్-1 కింద 58 కిమీ పొడవుతో బెంగళూరు - నిడఘట్ట మధ్య, ఫేజ్-2 కింద 61 కిమీ పొడవుతో నిడఘట్ట - మైసూర్ మధ్య ఉంది.
గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన ఈ ఎక్స్‌ప్రెస్‌వే మంగళూరుని బెంగుళూరుతో కలుపుతుంది. 119 కిమీ పొడవైన ఈ ఎక్స్‌ప్రెస్‌వే చాలా అందంగా కనిపించడమే కాకుండా, మధ్యలో వివిధ రైల్వే క్రాసింగ్‌ల పైన వెళుతుంది. అలాంటి రైల్వే క్రాసింగ్‌లలో ఒక క్రాసింగ్ వీడియో ఆనంద్ మహీంద్రా మనసు దోచింది.
Drone view of the new Bengaluru-Mysuru expressway with the Vande Bharat train passing underneath. A powerful visual symbol of how global-standard infrastructure is transforming India…👏🏽👏🏽👏🏽 pic.twitter.com/nBRiyCFHEd
— anand mahindra (@anandmahindra) February 13, 2023
Comments
Please login to add a commentAdd a comment