థానే: ఓ వైపు ఆర్‌జీ కార్ ఆస్పత్రిలో జరిగిన ఉదంతంపై దేశ వ్యాప్తంగా ఆందోళలు కొనసాగుతున్న వేళ.. మరికొందరు చిన్నారుల పట్ల ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నారు.
ఆగస్టు 16న మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఓ స్కూల్లో దారుణం జరిగింది. స్కూల్లో చదివే ఇద్దరు బాలికలపై అదే స్కూల్లో క్లీనింగ్ విభాగంలో పనిచేసే ఓ యువకుడు అమానుషంగా ప్రవర్తించాడు. ఈ దారుణం వెలుగులోకి రావడంతో థానే జిల్లా నిరసన కారుల ఆందోళనతో అట్టుడికిపోయింది.
#Maharashtra l Parents & residents in #Badlapur protest over the sexual exploitation of 2 minor girls, blocking the railway tracks. The accused sweeper has been arrested & the school has suspended staff & closed for 5 days.#Crime #Thane #WomenSafety#Justice #Assault #Protest pic.twitter.com/RClqTFyvwx
— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) August 20, 2024
బాధితుల తల్లిదండ్రులు, స్థానికులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. స్థానిక బద్లాపూర్ రైల్వే స్టేషన్‌లో రైళ్ల రాకపోకల్ని నిలిపివేశారు. దీంతో రైల్వే రాకపోకలు స్తంభించిపోయాయి.
ఈ సంఘటనతో స్కూల్ యాజమాన్యం ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసింది. క్లాస్ టీచర్‌ని తొలగించినప్పటికీ తల్లిదండ్రులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల భద్రతకు పూర్తి బాధ్యత వహించడంలో పాఠశాల విఫలమైందని, పాఠశాల యాజమాన్యం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
కాగా, బాధితుల ఆందోళనతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల దర్యాప్తులో పాఠశాల భద్రత విషయంలో లోపాలు బయటపడ్డాయి. బాలికల మరుగుదొడ్లు శుభ్రం చేసేందుకు మహిళా అటెండర్లు లేరని తేలింది. స్కూల్లో సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడాన్ని పోలీసులు గుర్తించారు. స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించారు.
Comments
Please login to add a commentAdd a comment