ముంబై : మహారాష్ట్రలో 35 అడుగుల మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం కూలిన ఘటనలో విగ్రహ తయారీ దారుడు జయదీప్ ఆప్టేను పోలీసులు అరెస్ట్ చేశారు. జయదీప్ ఆప్టే ప్రస్తుతం రాష్ట్ర డీసీపీ కార్యాలయంలో పోలీసు కస్టడీలో ఉన్నారు.
గత నెల ఆగస్ట్ 26న సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్‌కోట్ కోటలో ఏర్పాటు చేసిన 35 అడుగుల శివాజీ విగ్రహం కూలిపోయింది. ఈ ఘటన జరిగిన అనంతరం ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. మరాఠా యోధుడి విగ్రహం ఏర్పాటులో అవినీతి జరిగిందని, నిందితుల్ని అరెస్ట్ చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. దీంతో తనని పోలీసులు అరెస్ట్ చేస్తారని భయంతో జయదీప్ పరారయ్యాడు. ఎట్టకేలకు కణ్యాణ్ ప్రాంతంలో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అనుభవం లేకుండా విగ్రహం తయారీ
మహరాష్ట్రలో దుమారం రేపుతున్న శివాజీ విగ్రహం కూలిన ఘటనపై జయ్‌దీప్ గురించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. కల్యాణ్ ప్రాంతంలో విగ్రహాల తయారీ సంస్థను నిర్వహిస్తున్న జయ్‌దీప్‌కు అనుభవం లేదని పోలీసులు గుర్తించారు. చిన్న చిన్న విగ్రహాలు తయారు చేసిన అనుభవం ఉన్న జయ్‌దీప్ 30 అడుగుల భారీ విగ్రహాన్ని ఎలా తయారు చేశారనే ప్రశ్నలు తలెత్తతున్నాయి. అనుభవం లేకపోవడం, ఫలితంగా విగ్రహం కూలిపోవడంపై పోలీసులు జయ్‌దీప్‌పై కఠిన చర్యలు తీసుకోనున్నారు.
లుక్ అవుట్ నోటీసులు జారీ
విగ్రహం కూలిపోవడంతో ఇప్పటికే మహరాష్ట్ర పోలీసులు జయదీప్ ఆప్టే, నిర్మాణ సలహాదారు చేతన్ పాటిల్‌పై భారతీయ న్యాయ సంహిత చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.ఆగస్టు 31న పాటిల్‌ను అరెస్టు చేయగా..ఆప్టేపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అనంతరం, సింధుదుర్గ్ పోలీసులు బృందాలుగా విడిపోయి జయ్‌దీపై కోసం ముంబై, థానే, కొల్హాపూర్‌తో సహా పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు అరెస్ట్ చేశారు.
రాజకీయ దుమారం
మరికొన్ని రోజుల్లో మహరాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఛత్రపతి శివాజీ కూలిపోవడంపై రాజకీయ దుమారం చెలరేగింది. సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. విగ్రహ నిర్మాణానికి రాష్ట్ర ఖజానా నుంచి రూ.236 కోట్లు కేటాయించినప్పటికీ కేవలం రూ.1.5 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మహారాష్ట్ర కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఇంత భారీ నిర్మాణాన్ని రూపొందించడంలో అనుభవం లేకపోయినా జయదీప్‌కు ఇంత ముఖ్యమైన కాంట్రాక్టు ఎలా ఇచ్చిందంటూ ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్కనారు.
Comments
Please login to add a commentAdd a comment