
స్లాబ్ కూలిపోవడంతో అపార్ట్‌మెంట్‌కు ఏర్పడిన భారీ రంధ్రం
ముంబై: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. ఐదంతస్తుల భవనంలోని స్లాబ్ ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్‌కు కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటన థానే జిల్లాలోని ఉల్హాస్‌నగర్‌లో శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఉల్హాస్‌నగర్‌లోని నెహ్రూ చౌక్ వద్ద ఉన్న సాయిసిద్ధి అపార్ట్‌మెంట్‌లోని ఐదో అంతస్తులో స్లాబ్ కుప్పకూలింది.
సహాయ చర్యలు చేపడుతున్న ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, స్థానికులు
ఆ స్లాబ్ కూలి అది కిందపడి మిగతా అంతస్తుల్లోని కొన్ని ప్లాట్లు కూడా కుప్పకూలాయి. దీంతో అపార్ట్‌మెంట్‌కు పెద్ద రంధ్రం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే జాతీయ విపత్తు ప్రతిస్పందన (ఎన్‌డీఆర్‌ఎఫ్) బృందం స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టింది. భవనం శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించారు. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు మృతి చెందారని ఉల్లాస్‌నగర్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment