Seven died
-
స్లాబ్ కూలి భవనానికి పెద్ద రంధ్రం: ఏడుగురు మృతి
ముంబై: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. ఐదంతస్తుల భవనంలోని స్లాబ్ ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్‌కు కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటన థానే జిల్లాలోని ఉల్హాస్‌నగర్‌లో శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఉల్హాస్‌నగర్‌లోని నెహ్రూ చౌక్ వద్ద ఉన్న సాయిసిద్ధి అపార్ట్మెంట్లోని ఐదో అంతస్తులో స్లాబ్ కుప్పకూలింది. సహాయ చర్యలు చేపడుతున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, స్థానికులు ఆ స్లాబ్ కూలి అది కిందపడి మిగతా అంతస్తుల్లోని కొన్ని ప్లాట్లు కూడా కుప్పకూలాయి. దీంతో అపార్ట్‌మెంట్‌కు పెద్ద రంధ్రం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే జాతీయ విపత్తు ప్రతిస్పందన (ఎన్డీఆర్ఎఫ్) బృందం స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టింది. భవనం శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించారు. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు మృతి చెందారని ఉల్లాస్‌నగర్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
విషాదం; గ్యాస్ లీకై ఏడుగురి మృతి
-
విషాదం; గ్యాస్ లీకై ఏడుగురి మృతి
సీతాపూర్ : కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ పైప్‌లైన్ లీకవడంతో పేలుడు సంభవించి ఏడుగురు మృతి చెందిన ఘటన గురువారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలోని చోటుచేసుకుంది.కాగా మృతి చెందినవారిలో ముగ్గరు పిల్లలు ఉన్నట్లు తేలింది. స్థానికులు అందించిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని తమ పరిధిలోకి తీసుకొని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. జిల్లా ఎస్పీ ఎల్ఆర్ కుమార్ మాట్లాడుతూ.. బిస్వాన్ ప్రాంతంలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ పైప్‌లైన్ లీకై పేలుడు సంభవించిందని తెలిపారు. అయితే పేలుడు జరిగిన ప్రదేశం పక్కనే కార్పెట్ తయారీ కంపెనీ ఉండడంతో వాటికి మంటలు అందుకొని దట్టంగా పొగలు అలుముకున్నాయి. కాగా కార్పెట్ కంపెనీని ఆనుకొని ఏడుగురు పడుకొని ఉన్నారని , మంటలు వేగంగా వ్యాపించడంతో వారికి మంటలు అంటుకున్నాయని పేర్కొన్నారు. సమాచారం అందుకున్న తాము లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా పొగలు కమ్ముకొని దుర్వాసన రావడంతో మృతదేహాలను బయటికి తీయడంలో ఇబ్బందులకు గురయ్యామని ఎస్పీ వెల్లడించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారని తెలిపారు. ఈ ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు నష్ట పరిహారం కింద రూ. 4లక్షలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. -
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం
-
పిడుగుపాటుకు ఏడుగురు మృతి
-
పిడుగుపాటుకు ఏడుగురు మృతి
గుమ్మగట్ట(అనంతపురం): అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఆదివారం పిడుగుపాటుకు ఏడుగురు మృతిచెందారు. అనంతపురం జిల్లాలో ఐదుగురు, కర్నూలు జిల్లాలో ఇద్దరు మరణించారు. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం కలుగోడు గ్రామంలో ఆదివారం సాయంత్రం చిన్నపాటి వర్షం కురిసింది. ఈ సమయంలో పిడుగు పడింది. చెరువు ప్రాంతంలో గొర్రెలు, మేకలు మేపుకోవడానికి, సిమెంటు పనిమీద వెళ్లిన అయిదుగురు వ్యక్తులు పిడుగుపడిన శబ్దానికి అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు క్షేమంగా బయటపడ్డారు. బోయ శివప్ప(25), బోయ ఊబన్న(40), జనమ జయన్న(50), కంతార్లపల్లి గిరిరెడ్డి(40), కరీంసాబ్(34)లు అక్కడికక్కడే మృతిచెందారు. వీరంతా వేరువేరు కుటుంబాలకు చెందిన వారు. వర్షం నుంచి తలదాచుకునేందుకు పొలంలో ఉన్న రేకుల షెడ్డు కిందకు వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగింది. వీరిలో గిరిరెడ్డి, జయన్నలు మరో ముగ్గురితో కలిసి సమాధి పని చేసేందుకు కంకర కోసం చెరువు ప్రాంతానికి వెళ్లారు. కాగా, రాయదుర్గం మండలం కదరంపల్లిలో పిడుగుపాటుకు రెండు ఆవులు మృతిచెందాయి. కర్నూలు జిల్లాలో మరో ఇద్దరు మృతి పెద్ద కడబూర్: కర్నూలు జిల్లా పెద్ద కడబూర్ మండలం చిన్నతుంబలం గ్రామ పొలంలో పిడుగు పడి వృద్ద మహిళ, చిన్నారి మృతిచెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులు అవ్వ, మనుమరాలుగా గుర్తించారు. -
కరూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
♦ కారును ఢీకొన్న ఇసుక లారీ ♦ చిన్నారి సహా ఏడుగురు దుర్మరణం ♦ నలుగురికి తీవ్ర గాయాలు వాళ్లంతా ఒకే గ్రామానికి చెందిన వారు. ఆధ్యాత్మిక చింతనతో రాష్ట్ర పర్యటనకు బయలుదేరారు. ఆలయాలు చుట్టి ఆనందపరవశులయ్యారు. ఆ తీపి గురుతులను నెమరు వేసుకుంటూ ఇంటిముఖం పట్టారు. కానీ ఇంతలో అనుకోని ప్రమాదం. విధి ఆడిన వింత నాటకంలో ఏడుగురు బలైపోయారు. మరో నలుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన శనివారం కరూర్ జిల్లాలో కన్నీళ్లు తెప్పించింది. బంధువులకు తీరని శోకాన్ని మిగిల్చింది. సేలం : తమిళనాడులోని కరూర్ జిల్లాలో శనివారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు, మహిళ సహా ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. కేరళ రాష్ట్రం కాసర్కోడు జిల్లా మందైకాప్పు ప్రాంతానికి చెందిన రోహిత్ మంజర(22), జరాల్డ్ మంజర(35), క్షత్రియన్ (30), ఆల్విన్ (40), విహారం.. విషాదం రీవా (17), ప్రెజిల్లా (50), శాంతి (6), జెసిమా, ప్రేమ, సిల్ఫియా (3), రోషన్ కారులో వేలాంకన్ని పర్యాటనకు వెళ్లారు. పర్యటన ముగించుకుని శుక్రవారం రాత్రి అదేకారులో తిరుగుపయనమయ్యారు. కారును రోహిత్ మంజర నడుపుతున్నాడు. శనివారం ఉదయం 6.30 గంటలకు కరూర్ జిల్లా కుళితలై సమీపంలోని కె.పేట్టై బైపాస్ రోడ్డులో కారు వెళ్తోంది. అదే సమయంలో కరూర్ నుంచి ఇసుక లోడుతో తిరుచ్చి వైపు లారీ వేగంగా వస్తోంది. అకస్మాత్తుగా కారు – లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. కారు ముందు భాగంగా నుజ్జునుజ్జయింది. కారులోనివారు శిథిలాల్లో చిక్కుకుపోయారు. కేకలు విని స్థానికులు వారిని వెలుపలికి తీశారు. సమాచారం అందుకున్న కుళితలై పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో రోహిత్ మంజర (22), జరాల్డ్ మంజర (35), క్షత్రియన్ (30), ఆల్విన్ (40), రీవా (17), ప్రెజిల్లా (50), శాంతి (6) సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. జెసిమా, ప్రేమ, సిల్ఫియా (3), రోషన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుచ్చిలో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. లాలాపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో కారు టైర్లు పేలిన కారణంగా అదుపుతప్పి లారీని ఢీకొని ఉండవచ్చని చెబుతున్నారు. ప్రమాదం కారణంగా కరూర్ – తిరుచ్చి రోడ్డుపై రెండు గంటలకు పైగా వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
రక్తమోడిన రహదారులు...ఏడుగురు మృతి
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని రహదారులు రక్తమోడాయి. పలు జిల్లాల్లో మంగళవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డుప్రమాదాల్లో ఏడుగురు మృతిగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమ గోదావరి: నల్లజర్లలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.... ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా పెద్దపల్లిపాడు గ్రామానికి చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాసరావు, వెంకటకృష్ణ, మరో ఇద్దరు కారులో వెళుతుండగా వెనుక నుంచి తమిళనాడుకు చెందిన లారీ ఢీకొంది. ఈ సంఘటనలో శ్రీనివాసరావు, వెంకటకృష్ణతో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ముందు వెళుతున్న లారీలోంచి పెప్సీ బాటిళ్లు రోడ్డుపై పడిపోవడంతో వెనుక వస్తున్న కారును ఆపారు. వేగంగా వచ్చిన లారీ ఆగి ఉన్న కారును ఢీకొంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన కారు డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికు తరలించారు. తాడిపత్రి: అనంతపురం జిల్లాలో ఓ కారు బోల్తా పడిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.అనంతపురం నుంచి అంకిరెడ్డిపల్లెకు వేగంగా వస్తున్న స్కార్పియో వాహనం ముందు టైరు పంక్చరైంది. దాంతో కారు ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న అంకిరెడ్డిపల్లెకు చెందిన తండ్రీకుమారులు వెంకటయ్య(55), ఉదయభాస్కర్(27) అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ప్రయాణిస్తున్న అదే కుటుంబానికి చెందిన తిరుపాలమ్మ(50), సుధాకర్(20), ప్రసాద్(23) తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ఆస్పత్రికి తరలించారు. నల్లగొండ: చౌటుప్పల్ మండలం లక్కారం వద్ద ఆగి ఉన్న లారీను డీసీఎం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఖమ్మం నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ఈ సంఘటనలో డీసీఎంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతిచెందారు. సమాచారం అందుక్ను పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు కోదాడకు చెందినవారని పోలీసులు భావిస్తున్నారు. -
జాంబియాలో ఘోర రోడ్డు ప్రమాదం
లుసాక: డ్రైవర్ నిర్లక్ష్యానికి ఏడు నిండు ప్రాణాలు బలైన సంఘటన జాంబియాలోని లుసాకలో సోమవారం చోటుచేసుకుంది. రాజధాని పట్టణం లుసాక నుంచి 65 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఓ ప్రైవేటు బస్సు కపిరి ప్రాంతంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మహిళలు సహా ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో 51 మందికి కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. సమాచాన్ని అందుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే బస్సు బోల్తాకొట్టిందని ప్రయాణికుల ఆరోపిస్తున్నారు. ప్రమాదకరంగా బస్సును నడిపి ఏడుగురి మరణానికి కారణమైన డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం
చెన్నై: తమిళనాడులో ఘోరరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ధర్మపురి వద్ద ఓ కారు- వ్యాన్ బలంగా ఢీకొన్నాయి. దీంతో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా కారులో వెళుతున్నవారంతా కూడా ఒకే కుటుంబానికి చెందినవారని తెలిసింది. వీరంతా సేలం వెళుతున్నట్లు సమాచారం. కారు, వ్యాన్ రెండూ కూడా అదుపుచేయలేనంత వేగంతో ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. -
నెత్తురోడిన రహదారులు
రెండు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురి మృతి బెంగళూరు : కర్ణాటకలో రహదారులు నెత్తురోడాయి. రెండు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మంగళూరు నుంచి బెళగావికి వెళుతున్న ప్రైవేటు బస్సు (కేఏ 20-3269) ఆదివారం తెల్లవారుజామున 3.45 గంటలకు హుబ్లీ సమీపంలోని యల్లాపుర తాలూకా గుళ్లాపుర గ్రామం వద్ద ముందు వెళుతున్న బైక్‌ను ఢీ కొని.. అదే వేగంతో ఎదురుగా వస్తున్న మారుతీ ఓమ్నీ వాహనాన్ని కూడా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మారుతీ ఓమ్నీ వాహనంలోని శశికళా ద్యామణ్ణ వాడ్కర్ (40), అక్షతా ద్యామణ్ణ వాడ్కర్ (22), శారదా అనంతమాళె (55), దేవు జాదవ్ (33)తో పాటు ద్విచక్ర వాహనదారుడు (పేరు తెలియాల్సి ఉంది) అక్కడికక్కడే మరణించారు. ఇదే ఘటనలో గాయపడిన జ్యోతి, అనీలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వృతులంతా యల్లాపురానికి చెందినవారు. వీరు మరికొంతమందితో కలిసి ఓమ్నీ వాహనంలో ధర్మస్థలానికి వెళ్తుండగా ఘటన జరిగింది. మరో ప్రమాదంలో దేవనహళ్లి తాలూకా కన్నమంగలపాళ్య గ్రామ పంచాయతీ సభ్యుడు చంద్రేగౌడ (45), కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేస్తున్న అదే గ్రామానికి చెందిన నవీన్(30) మృతి చెందారు. వీరిద్దరూ విమానాశ్రయం నుంచి శనివారం రాత్రి 11 గంటల సమయంలో ద్విచక్రవాహనంపై కన్నమంగళపాళ్యకు వస్తూ.. దేవనహళ్లి గేట్ వద్ద నిలిచి ఉన్న టిప్పర్‌ను ఢీ కొన్నారు. ప్రమాదంలో నవీన్ అక్కడికక్కడే మృతి చెందగా, చంద్రేగౌడను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో చనిపోయాడు. -
చెన్నైలో ఘోర రోడ్డుప్రమాదం; ఏడుగురి మృతి
చెన్నై: తిరుచ్చి సమీపంలో ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ రోడ్డుప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రాణాలు తీస్తున్న ఎండలు
వడదెబ్బతో ఏడుగురు మృతి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు భయపెడుతున్న వడగాల్పులు బయటకు వెళ్లాలంటే జంకుతున్న జనం శుక్రవారం 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు సాక్షి నెట్వర్క్ : మండే ఎండలు ప్రజల ప్రాణాలను తీసేస్తున్నాయి. వడగాల్పులు, ఎండ వేడిమికి తట్టుకోలేక శుక్రవారం జిల్లాలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఉదయం తొమ్మిది గంటల కాక ముందు నుంచే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. దీంతో ప్రజలు బయటకు వెళ్లడానికి జం కుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లిన వృద్ధులు, చిన్నపిల్లలు అస్వస్థతకు గురవుతున్నారు. ఆళ్లగడ్డ పట్టణం ఎల్ఎం కాంపౌం డులో నివాసమున్న మాదము ఏలీశమ్మ (70) ఇలాగే అస్వస్థతకు గురయ్యారు. కూలి పనికి వెళ్లిన ఆమెకు మూడు రోజుల క్రితం తీవ్ర జ్వరం వచ్చింది. శుక్రవారం కోలుకోలేక మృతి చెందారు. ఆళ్లగడ్డ మండలం యాదవాడ గ్రామానికి చెందిన కట్టుబడి శిలార్షా (65) కూడా ఇలాగే మృత్యువాత పడ్డారు. గురువారం పొలం దగ్గరకు వెళ్లి సృ్పహ తప్పిపడిపోగా.. గమనించిన కొందరు వైద్యశాలకు తరలించారు. ఊపిరి పీల్చుకోలేక శుక్రవారం ఆయన మృతిచెందాడు. శాంతినగరం గ్రామానికి చెందిన అనువాయమ్మ (70), చాగలమర్రి గుంతపాలెం కాలనీకి చెందిన రైతు ముల్లా అబ్దుల్ రషీద్ (55), చాగలమర్రిలోని బుగ్గరస్తా కాలనీకి చెందిన గౌస్‌బీ (70) కూడా వడదెబ్బతో మృత్యువాత పడ్డారు. దేవనకొండకు చెందిన పింజారి లాలప్ప(55) ఉదయం తన పొలంలో పనిచేస్తూ.. ఎండవేడిమి తాళలేక అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతిచెందాడని వైద్యులు చెప్పారు. పాణ్యం గ్రామానికి చెందిన బాలన్న(75) కూడా వడదెబ్బతో శుక్రవారం మృతి చెందాడు. ఊర్లో పనులు లేక బతుకుతెరువు కోసం గుంటూరుకు వలస వెళ్లి నందవరం గ్రామానికి చెందిన లక్ష్మన్న వడదెబ్బతో మృత్యువాత పడ్డాడు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని ప్రజలు బయట ఎక్కువ సేపు తిరగవద్దని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో గొడుగు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలని, మంచినీళ్లు క్రమం తప్పకుండా తీసుకోవాలని చెబుతున్నారు. -
పీఓకేలో కూలిన పాక్ సైనిక హెలికాప్టర్
ఇద్దరు విదేశీ రాయబారులు సహా ఏడుగురి మృతి ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) లోని గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో శుక్రవారం పాక్ సైనిక హెలికాప్టర్ కూలిపోవడంతో ఏడుగురు మృతిచెందారు. మృతుల్లో ఫిలిప్పీన్స్ రాయబారి లీఫ్ లార్సన్, నార్వే రాయబారి డొమింగో లూసెనారియో, మలేసియా, ఇండోనేసియా రాయబారుల భార్యలు, ఇద్దరు ఆర్మీ పెలైట్లు, సిబ్బంది ఒకరు ఉన్నారు. మలేసియా, పోలండ్, డచ్ రాయబారులు గాయపడ్డారు. ఆరుగురు పాకిస్తానీలు, 11 మంది విదేశీయులతో వెళ్తున్న ఈ హెలికాప్టర్ నల్తార్ లోయ ప్రాంతంలో అత్యవసరంగా దిగుతూ కూలిపోయిందని ప్రాథమిక సమాచారం. హెలికాప్టర్ ఖాళీగా ఉన్న స్కూలుపై కూలడంతో ఆ భవనానికీ మంటలు అంటుకున్నాయి. హెలికాప్టర్‌ను క్షిపణితో తామే కూల్చామని, తమ లక్ష్యం పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, అతని సహచరులు అని పాక్ తాలిబాన్ ఉగ్రవాదులు ప్రకటించారు. షరీఫ్ వేరే హెలికాప్టర్లో ఉండడంతో బతికి బయటపడ్డాడని పేర్కొన్నారు. అయితే పాక్ ఆర్మీ దీన్ని తోసిపుచ్చింది. హెలికాప్టర్ ల్యాండ్ అవుతూ సాంకేతిక లోపంతోనే కూలిపోయిందని పేర్కొంది. నల్తార్కు వెళ్తున్న షరీఫ్ విమానాన్ని ఈ ఘటన నేపథ్యంలో దారి మళ్లించి ఇస్లామాబాద్‌కు తీసుకొచ్చామని పేర్కొంది. నల్తార్లో షరీఫ్ పాల్గొనాల్సిన కార్యక్రమం కోసం 37 దేశాలకు చెందిన దౌత్యవేత్తలను 3 హెలికాప్టర్లలో తీసుకెళ్తుండగా ఒకటి కూలిపోయిందని తెలిపింది. హెలికాప్టర్ 25 అడుగుల ఎత్తు నుంచి కూలిం దని పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ చెప్పారు. -
విషాద యాత్ర
విహార యాత్రకు వెళ్లి ఏడుగురు మృతి మృతుల్లో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు మరో ఇద్దరు బంధువులు మహబూబ్‌నగర్ జిల్లా అమనగల్లు మండలంలో ఘటన చాంద్రాయణగుట్ట: విహార యాత్ర విషాదాంతం కావడంతో పాతబస్తీలో విషాదం నెలకొంది. విహారయాత్ర కోసం వెళ్లిన వారిని చెరువు రూపంలో మత్యువు కబళించింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు, ఇద్దరు బంధువులు మృతి చెందడంతో చాంద్రాయణగుట్ట అల్ జుబేల్ కాలనీ, ఘాజీమిల్లత్ కాలనీ, హషమాబాద్లలో విషాద చాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. అల్ జుబేల్ కాలనీకి చెందిన అహ్మద్ బేగ్ అలియాస్ బాబు బాయి ఉస్మానియా మార్చురీలో పని చేస్తున్నాడు. బుధవారం అతను కుటుంబ సభ్యులతో కలిసి ఆమనగల్లు మండల పరిధిలోని సరికొండ గౌరమ్మ చెరువుకు విహార యాత్రకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. దీంతో బేగ్ ఇద్దరు కుమారులు సల్మాన్ (30), రహెమాన్ (19), కుమార్తె రొఖియా బేగం(18), కోడలు మోనా సుల్తానా (20), అల్లుడు షేక్ బాసిత్ (30), హషమాబాద్‌కు చెం దిన బంధువుల అమ్మాయి ముస్రత్ ఫాతీమా (19), వట్టేపల్లికి చెందిన ముస్కాన్ (18)లతో కలిసి మొత్తం 13 మంది రెండు వాహనాల్లో సరిగొండ గౌరమ్మ చెరువుకు వెళ్లారు. అయితే వీరిలో ఒకరు చెరువులోకి దిగుతుండగా అందులో పడి పోవడంతో వారిని కాపాడే క్రమంలో ఒకరి తరువాత ఒకరు మొత్తం ఏడు మంది చెరువులో దిగి మృతి చెందారు. దీనిపై సమాచారం అందడంతో ఆయా ప్రాంతాల్లో విషాదం నెలకొంది. మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం గురువారం నగరానికి తీసుకురానున్నట్లు తెలిసింది. బేగ్ కుటుంబంలో ఐదుగురు.. కాగా ఈ ఘటనలో అహ్మద్ బేగ్ కుటుంబంలో ఐదుగురు మృతి చెందడం స్థానికులను కలచివేస్తోంది. బేగ్ ఇద్దరు కుమారులతో పాటు కోడలు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. చిన్న కుమార్తె రొఖియా బేగం మృతి చెందగా, పెద్ద కుమార్తె అస్మా బేగం భర్త బాసిత్ అసువులు బాసాడు. దీంతో ఆ కుటుంబంలో బేగ్ దంపతులతో పాటు పెద్ద కుమార్తె ఒక్కరే మిగి లారు. విదేశాలకు వెళ్లిన బేగ్ భార్య గురువారం హైదరాబాద్‌కు తిరిగిరానున్నట్లు బంధువులు తెలిపారు. పెళ్లయిన 4నెలలకే.. మృతుల్లో ఒకరైన మోనా బేగం అలియాస్ మోనా సుల్తానాకు అహ్మద్ బేగ్ కుమారుడు సల్మాన్‌తో నాలుగు నెలల క్రితమే వివాహం జరిగింది. కాగా సల్మాన్, మోనాలిద్దరూ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవడంతో మోనా కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. 3నెలల క్రితమే రొఖియా బేగంకు నిశ్చితార్థం అహ్మద్ బేగ్ చిన్న కుమార్తె రొఖియా బేగంకు మూడు నెలల క్రితం నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు చూసుకుంటూ ఇరు కుటుంబాలు ఆనందంగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రొఖియా బేగం ఈ ప్రమాదంలో మృతి చెందడంతో వరుడి కుటుంబ సభ్యులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. ఆరుగురు క్షేమం మొత్తం 13మంది విహారానికి వెళ్లగా అందులో ఆరుగురు మాత్రం ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాదం నుం చి బయటపడిన వారంతా చిన్న పిల్లలు, వృద్ధులే. ఒకరిని కాపాడేందుకు ఒకరు చెరువులోకి వెళ్లి మరణించగా.. వీరు పిల్లలు, వృద్ధులు కావడంతో వారిని కాపాడే ప్రయత్నం చేయలేక పోయారు. దీంతో వారు ప్రమాదంలో చిక్కుకోలేదు. నగరానికి చేరుకున్న మృతదేహాలు... కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురిలో పోస్టు మార్టమ్ నిర్వహించిన అనంతరం ఏడుగురి మృతదేహాలను బుధవారం రాత్రి చాంద్రాయణగుట్ట పరిధిలోని హషామాబాద్, ఆల్బుబేర్కాలనీ, జీఎం కాలనీలలోని వారి నివాసాలకు తరలించారు. మృతుల కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యే పాషా ఖాద్రీ, మజ్లిస్ పార్టీ నాయకులు పరామర్శించారు. ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తాం: మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్దండ: ఆమనగల్లు మండలం చరికొండ గౌరమ్మ చెరువులో పడి మృతి చెందిన ఏడు మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ శ్రీదేవితో పాటు ప్రజాప్రతినిధులు మృతదేహలను పరిశీలించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించారు. మృతుల్లో ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున వారి కుటుంబ సభ్యులకు ఎక్స్‌గ్రేషియా అందిస్తామని చెప్పారు. పరీక్షా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న రహ్మాన్ అహ్మద్ బేగ్ చిన్న కుమారుడు పదో తరగతి పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాడు. బుధవారం జరిగిన ప్రమాదంలో రహ్మాన్ మృతి చెందినట్లు తెలుసుకున్న అతని స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటలోనే మృతి చెందిన హషమాబాద్‌కు చెందిన ముస్రత్ ఫాతీమా ఇంటర్ పరీక్షలు రాసింది. మరో మృతురాలు ముస్కాన్ కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉంటున్నందున ఆమె అహ్మద్ బేగ్ ఇంటిలోనే ఆశ్రయం పొందుతున్నట్లు స్థానికులు తెలిపారు. -
మిన్నంటిన మృత్యుఘోష
ఆటోను లారీ ఢీకొని ఏడుగురు మృతి, ముగ్గురికి గాయాలు ఆర్తనాదాలతో హోరెత్తిన తి్మ్మసముద్రం చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు, గాయపడిన వారి ఆర్తనాదాలు, కుటుంబ సభ్యుల రోదనలతో తివ్ముసవుుద్రంలో బుధవారం మృత్యుఘోష మిన్నంటింది. లారీ రూపంలో మృత్యువు ఏడుగురి ప్రాణాలను బలిగొంది. మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో పెను విషాదం అలముకుంది. లారీ, ఆటో డ్రైవర్ల నిర్లక్ష్యం మృతుల కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. పిచ్చాటూరు(కేవీబీ పురం): చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు, క్షతగాత్రుల ఆర్తనాదాలు, కుటుంబ సభ్యుల రోదనలతో కేవీబీపురం వుండలం తివ్ముసవుుద్రంలో బుధవారం మృత్యుఘోష మిన్నంటింది. షేర్ ఆటోను లారీ ఢీకొనడంతో ఏడుగురు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీకాళహస్తి నుంచి పదిమంది ప్రయాణికులతో షేర్ ఆటో కేవీబీపురానికి వస్తుండగా కేవీబీపురం మండలం తిమ్మసముద్రం వద్ద పిచ్చాటూరు నుంచి శ్రీకాళహస్తి వైపు వెళుతున్న లారీ రాంగ్ రూట్లో వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న కేవీబీపురం మండలం కోవనూరుకు చెందిన చెంగయ్యు(25), మఠం గ్రామానికి చెందిన ఉష(35), సబ్బులక్ష్మి(55), దిలీప్(3), జ్ఞానమ్మకండ్రిగకు చెందిన పద్మ(50), కళత్తూరుకు చెందిన భూపతవ్ము(50), ఓళూరు గ్రామానికి రాజయ్యు(25) అక్కడికక్కడే వుృతిచెందారు. వురో వుుగ్గురు తీవ్ర గాయూలపాలయ్యూరు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. ఇక తమకు దిక్కెవరు అంటూ లబోదిబోమన్నారు. ఉదయం తమ కళ్ల ఉండి ఇప్పుడు కానరాని లోకాలకు వెళ్లిపోయారా అంటూ రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది. లారీడ్రైవర్ తాగి ఉండడమే కారణం.. లారీ డ్రైవర్ వుద్యం తాగి ఉండడం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తాగేసి లారీని రాంగ్ రూట్లో నడపడంతో ఆటోడ్రైవర్ పక్కకు తిప్పినా లాభం లేకపోయిందని అంటున్నారు. పైగా ఆటోడ్రైవర్ ఓవర్ లోడ్‌తో రావడం కూడా మరో కారణంగా తెలిపారు. ఈ ఇద్దరి నిర్లక్ష్యం ఏడుగురి ప్రాణాలను బలితీసుకుందని అంటున్నారు. దిలీప్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లి వస్తున్న సుబ్బవ్ము, ఉష మృతుల్లో సుబ్బులక్ష్మి, ఉష, దిలీప్ ఒకే కుటుంబానికి చెందినవారు. దిలీప్‌కు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో అమ్మ ఉష, అమ్మమ్మ సుబ్బులక్ష్మి వుఠం గ్రామం నుంచి శ్రీకాళహస్తికి వచ్చారు. ఆస్పత్రిలో చూపించుకుని ఆటోలో స్వగ్రావూనికి తిరిగి వస్తున్నారు. తివ్ము సవుుద్రంలో జరిగిన రోడ్డు ప్రవూదంలో వుృత్యువాత పడ్డారు. ఉషకు భర్త వుల్లి, వురో కుమారుడు ఉన్నారు. చెంగయ్యు మీ-సేవ కేంద్రానికి వస్తూ.. కోవనూరు గ్రావూనికి చెందిన చెంగయ్యు సర్టిఫికెట్ కోసం కేవీబీ పురంలోని మీ-సేవా కేంద్రానికి పయునవుయ్యూడు. కోవనూరు వద్ద కేవీబీపురం వస్తున్న ఆటో ఎక్కాడు. ప్రవూదంలో వుృతువాతపడ్డాడు. పూల వ్యాపారం ముగించుకొని వస్తూ.. జ్ఞానవ్ము కండ్రిగ గ్రావూనికి చెందిన పద్మ రోజూ శ్రీకాళహస్తిలో పూల వ్యాపారం చేసేది. బుధవారం వ్యాపారం వుుగించుకుని ఇంటికి తిరుగు ప్రయాణమైంది. శ్రీకాళహస్తిలో ఆటో ఎక్కి వస్తూ రోడ్డు ప్రవూదంలో వురణించింది. భూపతవ్ము కూలిపని చేసి తిరిగి వస్తూ.. కళత్తూరు హరిజనవాడకు చెందిన భూపతవ్ము శీకాళహస్తిలో కూలిపని వుుగించుకొని ఇంటికి వచ్చేందుకు ఆటో ఎక్కింది. ప్రవూదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లింది. రాజయ్య ఊరూరా గాజుల వ్యాపారం చేస్తూ.. కేవీబీపురం వుండలం ఓళూరు గ్రావూనికి చెందిన రాజయ్యు ఊరూరు తిరిగి గాజుల వ్యాపారం చేసేవారు. ఈ క్రవుంలో వ్యాపారం వుుగించుకొని స్వగ్రావూనికి రావడానికి ఆటో ఎక్కాడు. తివ్ముసవుుద్రం వద్ద లారీ ఢీకొని వుృతి చెందాడు. అందర్నీ పోగొట్టుకున్నా : ఉష భర్త మల్లి రోడ్డు ప్రమాదం నా భార్య ఉష, కుమారుడు దిలీప్, అత్త సుబ్బులక్ష్మిని పొట్టనబెట్టుకుంది. కుమారుడికి ఆరోగ్యం బాగా లేదు ఆస్పత్రికి పోయి వస్తామని చెప్పి ఇలా కానరాని లోకాలకు వెళ్లిపోయారు. మమ్మల్ని ఒంటరిని చేశారు. ఇక నేను ఎవరి కోసం బతకాలి దేవుడా అంటూ రోదించడం హృదయాన్ని కలచి వేసింది. -
వేర్వేరు ఘటనల్లో ఏడుగురి మృతి
జిల్లాలో శనివారం వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. పెదవేగి మండలం పెదకడిమిలో విద్యుత్ స్తంభం మీద పడడంతో లైన్‌మేన్ ప్రాణాలు కోల్పోయాడు. కాళ్ల మండలంలో రోడ్డు ప్రమాదంలో మరోవ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మొగల్తూరు మండలం ఎల్బీ చర్ల, దేవరపల్లి మండలం గౌరీపట్నంలో రెండు గుర్తుతెలియని మృతదేహాలు లభ్యం కాగా పెదవేగి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒకరు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. విద్యుత్ స్తంభం మీద పడి.. ఏలూరు (టూటౌన్),న్యూస్‌లైన్ : నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు స్తంభం మీద పడడంతో ఓ విద్యుత్ ఉద్యోగి శనివారం మృతి చెందాడు. ఏలూరు మండలం శనివారపుపేటకు చెందిన రావినూతల శ్రీనివాస్ (43) పెదవేగి మండలం పెదకడిమిలో లైన్‌మేన్‌గా పనిచేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం గ్రామంలో నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు స్తంభం శ్రీనివాస్‌పై పడింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శ్రీనివాస్ మృతి విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి 10వ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నాడు. విషయం తెలుసుకున్న విద్యుత్ ఉద్యోగులు భారీగా ఆసుపత్రికి చేరుకున్నారు. గుర్తుతెలియని మహిళ దుర్మరణం నిడదవోలు, న్యూస్‌లైన్ : నిడదవోలు రైల్వేస్టేషన్ పరిధిలోని సింగవరం సమీపంలో ట్రాక్‌పై శనివారం రైలు ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతిచెందింది. రాజమండ్రి నుంచి విజయవాడ వైపు వెళ్లే గుర్తుతెలియని రైలు ఢీ కొని ఉంటుందని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. మృతురాలు ఐదడుగుల పొడవు, చామనఛాయ రంగులో ఉందని, 25 నుంచి 30 ఏళ్లు ఉంటాయని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలంలో మృతదేహం పడి ఉండడాన్ని బట్టి ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వే హెచ్‌సీ పరమహంస తెలిపారు. మృతురాలిని గుర్తుపట్టిన వారు 92474 03097 నంబర్‌కు ఫోన్ చేయాలని పోలీసులు కోరారు. ఎల్బీ చర్ల చెరువుగట్టుపై.. మొగల్తూరు, న్యూస్‌లైన్: మొగల్తూరు మండలం ఎల్బీ చర్ల చెరువుగట్టుపై గుర్తుతెలియని మృతదేహన్ని స్థానికులుగుర్తించారు. ఎస్సై కె.సుధాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని వడేటి పర్ర మురుగుకాలువ గట్టును ఆనుకుని ఉన్న పెద్దపట్నపు రామారావు చెరువు వద్ద మృతదేహం పడి ఉందన్నారు. మృతుడి ఎడమచేతిపై వీఆర్ సింహాచలం అని పచ్చబొట్టు రాసి ఉందని, మృతుడి వయసు 40 సంవత్సరాలు ఉండవచ్చన్నారు. మృతుడు ఐదు రోజులుగా గ్రామంలో పిచ్చికేకలు వేస్తూ సంచరించినట్టు గ్రామస్తులు తెలిపారు. అతడి వివరాలు తెలిస్తే 9440796619 నెం.కు తెలపాలని కోరారు. అనుమానాస్పదస్థితిలో.. పెదవేగి రూరల్, న్యూస్‌లైన్ : మండలంలోని విజయరాయి స్పిన్నింగ్‌మిల్లు సమీపంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందినట్టు ఎస్సై కె.స్వామి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదపాడు మండలం రామచంద్రపురానికి చెందిన ముంగంటి సూర్యనారాయణ (35) ఫ్యాక్టరీలకు కూలీలను పంపిస్తుంటాడు. శుక్రవారం ఉదయం ఇంటి వద్ద నుంచి సూర్యనారాయణ ఫ్యాక్టరీకి వెళ్లాడు. శనివారం ఉదయం సూర్యనారాయణ మృతి చెందినట్టు తనకు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్టు అతని భార్య రమాదేవి చెప్పారని, ఫ్యాక్టరీకి చెందిన వారెవరో తన భర్తను కొట్టి చంపి ఉంటారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరులో ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి ఏలూరు (టూటౌన్), న్యూస్‌లైన్ : సాధారణంగా వేసుకునే మాత్రలకు బదులు పొరపాటున వేరే మందు బిళ్లలు వేసుకుని అస్వస్థతకు గురైన ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు బావిశెట్టివారి పేటకు చెందిన బలువూరి రమ్య (19) ఏలూరు హేలాపురి ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతోంది. శనివారం సాయంత్రం ఇంటిలో ఒంటరిగా ఉన్న రమ్య ఏవో మాత్రలను వేసుకుని అపస్మారకస్థితిలోకి వెళ్లింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వచ్చేసరికి రమ్య మృతి చెందింది. వన్‌టౌన్ పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుర్తుతెలియని మృతదేహం లభ్యం గౌరీపట్నం (దేవరపల్లి), న్యూస్‌లైన్: దేవరపల్లి మండలం గౌరీపట్నం నిర్మలగిరి పుణ్యక్షేత్రం వెనుక వైపున క్వారీ వద్ద గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. సర్పంచ్ మెరిపో వెంకటేశ్వరరావు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం పూర్తిగా పాడైపోయి దుర్వాసన వెదజల్లుతూ గుర్తుపట్టడానికి వీలులేకుండా ఉందని హెడ్ కానిస్టేబుల్ కె.సూరిబాబు తెలినపారు. మృతుడికి 35 ఏళ్లు ఉంటాయని, ఎటువంటి ఆధారాలు లభించలేదని చెప్పారు.