తమిళనాడులో ఘోరరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ధర్మపురి వద్ద ఓ కారు- వ్యాన్ బలంగా ఢీకొన్నాయి. దీంతో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు.
చెన్నై: తమిళనాడులో ఘోరరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ధర్మపురి వద్ద ఓ కారు- వ్యాన్ బలంగా ఢీకొన్నాయి. దీంతో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయాలపాలయ్యారు.
వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా కారులో వెళుతున్నవారంతా కూడా ఒకే కుటుంబానికి చెందినవారని తెలిసింది. వీరంతా సేలం వెళుతున్నట్లు సమాచారం. కారు, వ్యాన్ రెండూ కూడా అదుపుచేయలేనంత వేగంతో ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం.