రెండు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురి మృతి
బెంగళూరు : కర్ణాటకలో రహదారులు నెత్తురోడాయి. రెండు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మంగళూరు నుంచి బెళగావికి వెళుతున్న ప్రైవేటు బస్సు (కేఏ 20-3269) ఆదివారం తెల్లవారుజామున 3.45 గంటలకు హుబ్లీ సమీపంలోని యల్లాపుర తాలూకా గుళ్లాపుర గ్రామం వద్ద ముందు వెళుతున్న బైక్‌ను ఢీ కొని.. అదే వేగంతో ఎదురుగా వస్తున్న మారుతీ ఓమ్నీ వాహనాన్ని కూడా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మారుతీ ఓమ్నీ వాహనంలోని శశికళా ద్యామణ్ణ వాడ్కర్ (40), అక్షతా ద్యామణ్ణ వాడ్కర్ (22), శారదా అనంతమాళె (55), దేవు జాదవ్ (33)తో పాటు ద్విచక్ర వాహనదారుడు (పేరు తెలియాల్సి ఉంది) అక్కడికక్కడే మరణించారు. ఇదే ఘటనలో గాయపడిన జ్యోతి, అనీలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వృతులంతా యల్లాపురానికి చెందినవారు.
వీరు మరికొంతమందితో కలిసి ఓమ్నీ వాహనంలో ధర్మస్థలానికి వెళ్తుండగా ఘటన జరిగింది. మరో ప్రమాదంలో దేవనహళ్లి తాలూకా కన్నమంగలపాళ్య గ్రామ పంచాయతీ సభ్యుడు చంద్రేగౌడ (45), కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేస్తున్న అదే గ్రామానికి చెందిన నవీన్(30) మృతి చెందారు. వీరిద్దరూ విమానాశ్రయం నుంచి శనివారం రాత్రి 11 గంటల సమయంలో ద్విచక్రవాహనంపై కన్నమంగళపాళ్యకు వస్తూ.. దేవనహళ్లి గేట్ వద్ద నిలిచి ఉన్న టిప్పర్‌ను ఢీ కొన్నారు. ప్రమాదంలో నవీన్ అక్కడికక్కడే మృతి చెందగా, చంద్రేగౌడను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో చనిపోయాడు.
నెత్తురోడిన రహదారులు
Published Mon, Mar 7 2016 3:13 AM | Last Updated on Tue, Oct 30 2018 5:51 PM
Advertisement