థానే: తుపాకీతో బెదిరించి మహిళపై దుండగుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. తలపై తుపాకీ పెట్టి బెదిరించి దుండగుడు తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని బాధితురాలు ఫిర్యాదు చేసినట్టు నావఘర్ పోలీసు స్టేషన్ అధికారి తెలిపారు.
భయాందర్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఏటీఎం ఎదురుగా ఉన్న ప్రాంతంలో శనివారం సాయంత్రం 2.30 నుంచి 5 గంటల మధ్య ఈ దురాగతం జరిగిందని వెల్లడించారు. బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపి, కేసు నమోదు చేసినట్టు చెప్పారు. నిందితుల కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.
తుపాకీతో బెదిరించి మహిళపై అత్యాచారం
Published Sun, Jun 1 2014 7:27 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
Advertisement
Advertisement